Telugu News » Metro sittings : మెట్రో స్టేషనే కల్లు కాంపౌండాయె..!

Metro sittings : మెట్రో స్టేషనే కల్లు కాంపౌండాయె..!

నగరంలో మెట్రోస్టేషన్స్ మందు సిట్టింగ్స్ కు బెస్ట్ ప్లేస్ గా మారింది.

by sai krishna

పావలా బిల్లు కట్టక్కర్లేదు…అదురూ బెదురు లేనే లేదు. అసలు మందు సిట్టింగ్ కు మెట్రో స్టేషనంత పక్కా చోటు లేదు..! ఇదీ..హైదరాబాద్ నగరం (Hyderabad)లో మందుబాబుల డీసెంట్ డ్రింకింగ్ థాట్. అర్ధరాత్రి దాటిందంటే చాలు ఆవారాగాళ్లు మెట్రో స్టేషన్(Metro station)ని మోహరిస్తున్నారు.

పీపాలకు పీపాలు పీల్చేస్తున్నారు. క్వార్టర్లకు క్వార్టర్లు కుప్పలు పోస్తున్నారు. ఫుల్‌ గా తాగి రోడ్డుపై హల్‌చల్‌ చేస్తున్నారు.ఇప్పుడు ఒకడుగు ముందుకేసి పట్టపగలే డ్రగ్స్ సేవిస్తున్నారు. దీంతో నగరవాసులు భయభ్రాంతులకు లోనవుతున్నారు.

పెట్రోలింగ్ పోలీసులను సైతం ఖాతరు చేయకుండా మద్యం సేవించి పోలీసులకు సవాల్ విసురుతున్నారు.
నగరంలో పబ్లిక్ ప్లేసులే అడ్డాగా మార్చుకుంటు మందు కొడుతున్నారు. మనల్ని ఎవర్రా ఆపేది అంటూ మెట్రో, జనావాసాల్లో మందు తాగుతూ ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నారు.

కాగా.. హైదరాబాద్ మెట్రో నిత్యం లక్షల మందిని వారి గమ్యస్థానాలకు చేరవేస్తుంది. చిన్న వ్యాపారులు, ఐటీ ఉద్యోగులు( IT employees), విద్యార్థులు మరియు నగరంలోని ఒక మూల నుంచి మరో మూలకు ప్రయాణించే కుటుంబాలకు ఇది సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది.

metro-yusufguda-station
అయితే ఇలాంటి మెట్రో స్టేషన్లు కొన్ని సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డంకులుగా మారుతున్నాయి. యువ జంటల లిఫ్ట్‌ లో టిక్ టాక్ డ్యాన్స్‌ లు, ఇన్‌స్టా రీల్స్ (Insta Reels), కౌగిలించుకోవడాలు, ముద్దులు పెట్టుకోవడాలు వంటి ఘటనలు మహానగరాల్లో వెలుగు చూసిన సంగతి తెలిసిందే.

ప్రయాణికుల అభ్యర్థన మేరకు మెట్రో అధికారులు ఇలాంటి మోసాలపై సీరియస్‌గా చర్యలు తీసుకుని తనిఖీ(check)లు చేపట్టారు. ప్రయాణికుల(Passengers)కు ఇబ్బంది కలిగించేలా వ్యవహరిస్తే కేసులు పెడతామని హెచ్చరించారు.

ఇదిలా ఉండగా మెట్రో స్టేషన్ల పరిధిలో మరికొన్ని అసాంఘిక కార్యకలాపాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల పంజాగుట్ట మెట్రో స్టేషన్ (Panjagutta Metro Station) పరిధిలో ఇద్దరు యువకులు పట్టపగలు గ్లాసుల్లో మందు కలిపి దర్జాగా తాగుతున్న వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.

మంత్రి కేటీఆర్, తెలంగాణ పోలీసులను ట్యాగ్ చేస్తూ ఓ నెటిజన్ వీడియో షేర్ చేశాడు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అది మరిచిపోకముందే యూసుఫ్‌గూడ మెట్రో స్టేషన్‌ పరిధిలో కూడా కొందరు యువకులు పట్టపగలు డ్రగ్స్‌ సేవిస్తున్నారు.

స్టేషన్ కి ఇరువైపులా ఏర్పాటు చేసిన బెంచీల మీద దర్జాగా కూర్చున్నారు. మెట్రో స్టేషన్లంటే పర్మిట్ రూమ్స్(Permit rooms) అని భావించి సిగ్గు లేకుండా మందు కొడుతున్నారు. పక్కనే గుడి ఉన్నప్పటికీ.. అటుగా వచ్చే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బీరువా తాగి చల్లబరుస్తున్నారు.

ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీటిని చూసిన పలువురు ప్రయాణికులు మెట్రో స్టేషన్ల నిర్వహణపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మెట్రో స్టేషన్ల దగ్గర వైన్స్, బార్లు ఉండడంతో మందు బాబులు రెచ్చిపోతున్నారు.

మెట్రో స్టేషన్ల కింద కూర్చున్నారు. కళాశాలలు, పాఠశాలలకు వెళ్లే బాలికలతో పాటు కూలి పనులకు వెళ్లే మహిళలు, కుటుంబ సమేతంగా వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోతున్నారు. ఇప్పటికైనా స్పందించి ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

You may also like

Leave a Comment