Telugu News » Syria Drone attack : సిరియాలో ఉగ్ర దాడి..100 మందికి పైగా మృతి..

Syria Drone attack : సిరియాలో ఉగ్ర దాడి..100 మందికి పైగా మృతి..

సిరియన్ మిలిటరీ (Military) అకాడమీపై జరిగిన డ్రోన్ (Drone) దాడిలో సుమారు100 మంది మృతి చెందగా, 125 మందికి పైగా గాయపడినట్టు

by Venu

సిరియాలో (Syria) మరోసారి ఉగ్రవాదులు భీకర దాడులు చేశారు. సిరియన్ మిలిటరీ (Military) అకాడమీపై జరిగిన డ్రోన్ (Drone) దాడిలో సుమారు100 మంది మృతి చెందగా, 125 మందికి పైగా గాయపడినట్టు, మరణించిన వారిలో సగం మంది సైనిక గ్రాడ్యుయేట్లు అని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ తెలిపింది.

హౌమ్స్‌ ప్రావిన్స్‌లో సైనిక కళాశాల గ్రాడ్యుయేషన్‌ వేడుక జరుగుతున్న సమయంలో ఈ దారుణం జరిగింది. కాగా సిరియా అంతర్యుద్ధంలో ప్రభుత్వంతో పోరాడుతున్నతిరుగుబాటుదారులు లేదా సాయుధ ఉగ్ర సంస్థలే గ్రాడ్యుయేషన్‌ డేను లక్ష్యంగా చేసుకొని డ్రోన్‌ దాడికి పాల్పడినట్లు సిరియా మిలిటరీ ఆరోపించింది. ఈ దాడికి ప్రతిచర్య తప్పదని ఆర్మీ వెల్లడించింది.

ఇకపోతే పేలుడు పదార్థాలు కలిగిన డ్రోన్‌తో మిలిటరీ అకాడమీని లక్ష్యంగా చేసుకొని దాడి జరిగిందని సిరియా మిలిటరీ పేర్కొన్నట్టు స్థానిక మీడియా సంస్థలు తెలిపాయి. ఈ వేడుకకు సిరియా రక్షణ శాఖ మంత్రి కూడా హాజరయ్యారు. అయితే, ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయిన కొన్ని నిమిషాలకే ఈ దాడి జరిగింది.

ఇకపోతే ఈ దాడిలో మరణించిన వారిలో ఆరుగురు మహిళలు, ఆరుగురు చిన్నారులు ఉన్నట్టు ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి హసన్‌ అల్‌ గబ్బాష్‌ తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఇక మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని శుక్రవారం (Friday) నుంచి మూడు రోజులపాటు సంతాప దినాలు పాటిస్తున్నట్టు సిరియా ప్రభుత్వం ప్రకటించింది.

You may also like

Leave a Comment