శ్రీకృష్ణుడు ఏలిన ద్వారక(Dwaraka) ఓ అపురూప ఘట్టానికి వేదికైంది. సుమారు 5000 ఏళ్ల కిందట శ్రీకృష్ణుని కాలంలో చేసిన అతీంద్రియ కర్మలను వేలాది మహిళలు మరోసారి పునరావృతం చేశారు. బ్రహ్మ ముహూర్తంలో 37వేల మంది మహిళలు కలిసి కృష్ణుడిని తలుచుకుంటూ తన్మయత్వంతో ‘మహారాస్’(Maharas) సంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శించారు.
ఈ అందమైన దృశ్యాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరించారు. వారంతా రాస్ వాయించి ప్రపంచ రికార్డుని నెలకొల్పారు. ఈ అద్భుత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుజరాత్‌లోని దేవ భూమి ద్వారకలో ఆల్ ఇండియా మహారస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ పూనమ్ బెన్ మేడమ్ హాజరయ్యారు.
ఇందులో 37 వేల మంది అహిర్ వర్గానికి చెందిన మహిళలు పాల్గొన్నారు. జానపద కథల ప్రకారం.. శ్రీకృష్ణుడు డోలు వాయిస్తుండగా మహిళలందరూ కృష్ణుడితో రాస్ వాయించడానికి వెళ్లారు. ఆ స్థలంలో ఇప్పటికీ స్త్రీలందరి సమాధులు ఉన్నాయి. బాణాసురుడి కుమార్తె, శ్రీ కృష్ణుడి కోడలు ఉష గౌరవార్థం ఈ మహారాసులను నిర్వహించినట్లు నిర్వాహకులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ప్రపంచ వేదికపై శాంతి, పరిశుభ్రతపై సందేశమివ్వడానికే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మహిళలంతా ముందుగానే ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 9 నెలలుగా మహిళలు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 37మంది మహిళలు సంప్రదాయ ఎరుపు రంగు దుస్తులు ధరించి ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. 800బిగాల భూమిలో ఈ మహా రాసులు నిర్వహించారు. రెండు లక్షల మంది వరకు ప్రసాదాలను అందజేశారు. దేశవ్యాప్తంగా అహిర్ కమ్యూనిటీకి చెందిన సుమారు 1.5 లక్షల మంది ఈ నృత్యాన్ని వీక్షించారు.
#WATCH देवभूमि द्वारका, गुजरात: अहीर समुदाय की महिलाओं ने यात्राधाम में अखिल भारतीय महारास संगठन के तहत महारास किया। pic.twitter.com/CCGtkgicQw
— ANI_HindiNews (@AHindinews) December 24, 2023