భారత్ ఇటీవల తరచూ భూకంపాలు(Earthquake) చోటు చేసుకుంటున్నాయి. కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్(Ladakh)లో వరుస భూకంపాలు హడలెత్తిస్తున్నాయి. తాజాగా మరోసారి లడఖ్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.5గా నమోదయింది.
లడఖ్‌లో మంగళవారం తెల్లవారుజామున భూమి కంపించింది. నేషనల్ సిస్మోలాజికల్ సెంటర్ ప్రకారం.. ఉదయం 4:33 గంటలకు భూకంపం సంభవించింది. దీని కేంద్రం ఉపరితలం నుంచి 5 కిలోమీటర్ల దిగువన ఉంది. సోమవారం అర్ధరాత్రి దాటాక జమ్మూలో కూడా భూకంపం సంభవించినట్లు సమాచారం.
జమ్మూ కశ్మీర్‌లోని కిష్త్వార్‌లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.7గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలాజకల్(NCS) తెలిపింది. NCS ప్రకారం, భూకంపం తెల్లవారుజామున 1.10 గంటలకు 5 కిలోమీటర్ల లోతులో సంభవించింది.
భూకంపానికి జనాలు గాఢనిద్రలో ఉన్న తెల్లవారుజామున సమయంలో భూప్రకంపనలు సంభవించాయి. ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. కొండ ప్రాంతాల్లో 5 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకటించింది. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా వివరాలు వెల్లడించింది.