Telugu News » earthquake: బాలి సముద్ర తీరంలో భారీ భూకంపం!

earthquake: బాలి సముద్ర తీరంలో భారీ భూకంపం!

యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్)భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదైంది.

by Sai
indonesia

ఇండోనేషియా (Indonesia )లోని బాలి (bali) సముద్ర ప్రాంతంలో మంగళవారం భారీ భూకంపం (earthquake) సంభవించింది. ఈ భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రతతో ఉందని యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ వెల్లడించింది.

indonesia

భూకంప కేంద్రం ఇండోనేషియాలోని మాతరానికి ఉత్తరంగా 201 కిలోమీటర్ల దూరంలో భూమి ఉపరితలం నుంచి 518 కిలోమీటర్లు దిగువన ఉందని ఇండోనేషియా అధికారులు చెప్పారు.

సముద్రగర్భంలో లోతుగా సంభవించిన భూకంపం ఫలితంగా సునామీ వచ్చే ప్రమాదం లేదని యూఎస్ సునామీ హెచ్చరిక వ్యవస్థ తెలిపింది.యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్)భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదైంది.

ఇండోనేషియాలోని వెస్ట్ నుసా టెంగ్‌గారాలోని బంగ్సాల్ సమీపంలో భూకంప కేంద్రం కింద 525 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని శాస్త్రవేత్తలు చెప్పారు.

తరచూ భూకంపాలు సంభవించే ఇండోనేషియా బాలి సముద్ర ప్రాంతంలో భూకంపం వచ్చినా ఎలాంటి నష్టం జరగలేదని ఇండోనేషియా అధికారులు చెప్పారు.

You may also like

Leave a Comment