Telugu News » Earthquake: వణికించిన భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం..!

Earthquake: వణికించిన భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం..!

ఇండోనేషియాలోని పపువా ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.2గా నమోదైంది. భూకంప కేంద్రం 77కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

by Mano
Earthquake: Trembling earthquake.. People ran..!

ఇండోనేషియా(Indonesia)లోని పపువా(Papua) ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. శనివారం రాత్రి 10.46గంటలకు భూకంపంతో జనం భయంతో ఇళ్లలోంచి పరుగులు తీశారు. భూకంపం(Earthquake) తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.2గా నమోదైంది. భూకంప కేంద్రం 77కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

Earthquake: Trembling earthquake.. People ran..!

అయితే ఈ భూకంపంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, సునామీ లాంటి ప్రమాదమేమీ లేదని ఇండోనేషియా వాతావరణ విభాగం వెల్లడించింది. అయితే మరికొన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. కొన్ని చోట్ల భూకంప తీవ్రత 6.3, 6.5గా నమోదైంది.

యూఎస్ యోలాజికల్ సర్వే ప్రకారం రాజధాని జయపురాలోని అబేపురాకు ఈశాన్యంగా 162 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఇండోనేషియాలో భూకంపం సర్వసాధారణం. 27 కోట్ల జనాభా ఉన్న ఇండోనేషియాలో ప్రతిరోజూ భూకంపాలు, అగ్నిపర్వతాలు పేలుతున్నట్లు నిరంతరం వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి, అబేపురా జనాభా 62,250మాత్రమే.

ఇండోనేషియాలోని అతి తక్కువ జనాభా కలిగిన నగరాల్లో ఇది ఒకటి. ఫిబ్రవరిలో వచ్చిన భూకంపంతో నలుగురు మృతిచెందారు. అదేవిధంగా, నవంబర్ 21న పశ్చిమ జావాలో 5.6 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 331 మంది మృతిచెందారు. 600 మందికి పైగా గాయపడ్డారు. 2018లో సులవేసిలో సంభవించిన భూకంపం, సునామీ 4,340 మందిని మృతిచెందారు.

You may also like

Leave a Comment