అఫ్గానిస్తాన్ (Afghanistan)లో మరోసారి భూకంపం (Earthquake) చోటుచేసుకుంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైందని భూపరిశోధన అధికారులు వెల్లడించారు. ఇప్పటికే వారానికి రెండు భూకంపాలు అఫ్గానిస్తాన్ లో సంభవిస్తున్నాయి. తాజాగా ఫైజాబాద్ (Faizabad) లోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనాలు సంభవించాయి.. దీంతో ప్రజలు ఇళ్లను వదిలి బయటకు పరుగులు తీశారు..
ఇప్పటికే అఫ్గానిస్తాన్‌లో సంభవించిన భూకంపాల కారణంగా 10 వేలకు పైగా జనం మరణించారని అధికారులు అంచనా వేశారు.. కాగా ఇటీవల వచ్చిన భూకంపంలో భారీగా ప్రాణ నష్టం జరిగిన విషయం తెలిసిందే. భూకంపాల ధాటికి అఫ్గానిస్థాన్ అతలాకుతలమవుతోంది. ఇప్పటికే తాలిబన్ల పాలనలో అఫ్గాన్ ఆర్థిక వ్యవస్థ అద:పాతాళానికి చేరుకుంది.
తాజాగా సంభవిస్తున్న భూకంపాలతో అఫ్గానిస్తాన్ అల్లకల్లోలంగా మారిందని అధికారులు వెల్లడిస్తున్నారు.. ఎప్పుడు ఏం జరుగుతోందో అనే ఆందోళన, భయం ఇక్కడి ప్రజలను వెంటాడుతోందని అంటున్నారు.. మరోవైపు ఈ భూకంపాల ధాటికి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా భారీగా సంభవించడం ఈ దేశాన్ని కొలుకోకుండా చేస్తుందని అంటున్నారు.. ఇప్పటికే ప్రపంచం భూకంపాలతో ఆందోళన చెందుతోన్న విషయం తెలిసిందే..