Telugu News » Eatala Rajender : కేసీఆర్ ను నమ్మి మోసపోవద్దు!

Eatala Rajender : కేసీఆర్ ను నమ్మి మోసపోవద్దు!

బీజేపీకి ఓటేస్తే మోటార్లకు మీటర్లొస్తున్నాయని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఈటల. తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని.. ప్రతీ వ్యక్తి మీద లక్షా 30 వేల అప్పు ఉందన్నారు.

by admin
eatala rajender fire on cm kcr

తెలంగాణ వీరుల త్యాగాలకు గౌరవం దక్కాలంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలన్నారు ఆపార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్. ప్రభుత్వ పథకాలన్నీ బీఆర్‌ఎస్ పార్టీ వాళ్లకే వస్తున్నాయని.. తమకు ఓటు వేయకపోతే పథకాలు, పెన్షన్లు ఇవ్వమని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ఇదేమీ మీ అబ్బ జాగీరు కాదంటూ బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు.

eatala rajender fire on cm kcr

బీజేపీకి ఓటేస్తే మోటార్లకు మీటర్లొస్తున్నాయని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఈటల. తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని.. ప్రతీ వ్యక్తి మీద లక్షా 30 వేల అప్పు ఉందన్నారు. కళ్యాణలక్ష్మి, పెన్షన్లలో కోత పెట్టారని.. అవన్నీ సైరైన సమయంలో రావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని చెప్పారు. తెలంగాణ చిన్నమ్మగా పిలుచుకునే సుష్మాస్వరాజ్ ఆనాడు తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చెయ్యొద్దని, రాష్ట్రం ఏర్పాడుతుందని మాటిచ్చారని గుర్తు చేశారు. అలాగే, రాజ్ నాథ్ సింగ్ మద్దతు ఇస్తున్నామని తెలిపిన తరువాతే తెలంగాణ ప్రక్రియ వేగవంతం అయ్యిందని తెలిపారు.

బీజేపీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదన్నారు రాజేందర్. బీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలను వంచిస్తోందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికలలో బీజేపీని గెలిపించాలని.. గొప్ప తెలంగాణగా మార్చుకుందామని తెలిపారు. దేశంలోనే ఎన్నికలలో అత్యధిక డబ్బు ఖర్చుపెట్టే నీచమైన సంస్కృతి బీఆర్‌ఎస్ పార్టీదన్న ఆయన.. ఇతర పార్టీల నాయకులకు వెలకట్టే కల్చర్ కేసీఆర్ దంటూ ఫైరయ్యారు.

తెలంగాణ వచ్చాక గొప్పగా దేశానికే ఆదర్శంగా ఉంటానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇప్పుడు మద్యం, ఎన్నికల ఖర్చులో మాత్రం తెలంగాణను మొదటి వరుసలో నిలిపారని విమర్శలు చేశారు. ప్రజలకు మంచి చేయాలని నిజంగా కలలు కనే నాయకులకు అవకాశం లేకుండా డబ్బుతో గెలుస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే పదవిని కేసీఆర్ అంగట్లో సరుకుగా చేసారన్న ఈటల.. ఎన్నికల కోడ్ వచ్చింది కొత్త పథకాలు ఇవ్వడానికి వీలు లేదని తెలిపారు. తీసుకున్న అప్లికేషన్లు అన్నీ బుట్టదాఖలు తప్ప ఇచ్చే అవకాశం లేదన్నారు. కేసీఆర్ చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలను కోరారు రాజేందర్.

You may also like

Leave a Comment