పలు రాష్ట్రాల్లో ఈడీ (Enforcement Directorate) దాడులు కలకలం రేపుతున్నాయి. మొత్తం 17 ప్రాంతాల్లో ఈడీ దాడులు (Raids) చేస్తోంది. అశోక వర్శిటీ (Ashoka University) వ్యవస్థాపకులకు సంబంధించిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఈ దాడులు చేస్తున్నట్టు ఈడీ వర్గాలు వెల్లడించాయి.
ఢిల్లీ, ముంబై, చండీఘడ్, పంచకుల, అంబాల నగరాల్లో దాడులు జరుగుతున్నట్టు పేర్కొన్నాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని కన్సార్టియాన్ని రూ. 1,626.74 కోట్లకు మోసం చేశారనే ఆరోపణలపై ఆ సంస్థకు చెందిన టాప్ ఎగ్జిక్యూటివ్‌లపై సీబీఐ ఇటీవల కేసులు నమోదు చేసింది.
ఈ మేరకు డైరెక్టర్లు దీపాళి గుప్తా, రామ గుప్తా, జగిత్ సింగ్ చాచల్, సంజీవ్ కుమార్, వందనా సింగ్లా, ఇష్రత్ గిల్, సంస్థ హామీదారులు TN గోయల్, నిర్మల్ బన్సల్,జేడీ గుప్తాలపై కేసులు నమోదు చేసింది. అనంతం 12 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. విశ్వ విద్యాలయానికి 200 మంది వ్యవస్థాపకులు ఉన్నట్టు గతంలో సీబీఐ వెల్లడించింది.
సోదాల సమయంలో కీలకమైన డాక్యుమెంట్లను, రూ. .58 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు జరుపుతోంది. పారాబొలిక్ ఔషధ సంస్థకు ప్రణవ్ గుప్తా మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండగా, వినీత్ సంస్థకు డైరెక్టర్ గా వున్నారు. ఇది ఇలా వుంటే రేషన్ పంపిణీ కుంభ కోణంలో బెంగాల్ మంత్రి జ్యోతి ప్రియ మల్లిక్ ను ఈడీ అరెస్టు చేసింది.