Telugu News » GHMC COMMISSIONER : లోక్‌సభ ఎన్నికల ఎఫెక్ట్.. రూ.13.72 కోట్ల నగదు పట్టివేత..

GHMC COMMISSIONER : లోక్‌సభ ఎన్నికల ఎఫెక్ట్.. రూ.13.72 కోట్ల నగదు పట్టివేత..

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్‌ఫోర్స్ మెంట్ (Enforcement Officers) అధికారులు తనిఖీలను (Checkings) ముమ్మరం చేశారు. హైదరాబాద్ మహానగరంలో ఇప్పటికే ఫ్లయింగ్ స్వ్కార్డ్ బృందాలు నిరంతం తనిఖీలను ముమ్మరం చేశాయి. చెక్ పోస్టులు, ప్రధాన కూడళ్లు, జంక్షన్లు, సిటీలోకి ప్రవేశించే మార్గాల్లో సీక్రెట్‌గా ఈ బృందాలు తిరుగుతున్నట్లు సమాచారం.

by Sai
Effect of Lok Sabha elections.. Rs. 13.72 crores of cash seizure..

ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే ఈసీ(Election Commission) పలు కీలక ప్రకటనలు చేసింది. డబ్బును(Money) పెద్ద మొత్తంలో ఎవరూ తీసుకెళ్లరాదని ఈసీ షెడ్యూల్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే. కొందరు ఆ విషయం తెలియక డబ్బులు మొద్దమొత్తంలో క్యారీ చేస్తూ పట్టుబడుతున్నారు.

ఫంక్షన్ల సీజన్ కావడంతో ప్రజలు వాహనాల్లో డబ్బులు క్యారీ చేస్తూ దొరికిపోతున్నారు. అసలు దొంగలు మాత్రం గుట్టుగా నగదును ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చుతున్నట్లు సమాచారం అందుతోంది. ఎన్నికల్లో డబ్బులు పంచడానికి ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తున్న కీలక నేతలు రహస్యంగా డబ్బులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారుస్తున్నా.. ఫ్లయింగ్ స్వ్కాడ్ బృందాలు వారిని కనిపెట్టలేకపోతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు హైదరాబాద్ నగరంలో రూ.13.72 కోట్ల నగదును సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ తెలిపారు. అయితే, ఈ డబ్బులో అధికభాగం సామాన్య ప్రజలు, వ్యాపారుల నుంచే పట్టుబడినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు భారీ మొత్తంలో పొలిటికల్ లీడర్స్‌కు సంబంధించి డబ్బు పట్టుబడినట్లు కథనాలు రాకపోవడం గమనార్హం.

You may also like

Leave a Comment