Telugu News » Election campaign : బీఆర్ఎస్ లేకుంటే తెలంగాణ లేదన్న వారికి సిగ్గు ఉండాలి.. జనం శాపనార్థాలు..!!

Election campaign : బీఆర్ఎస్ లేకుంటే తెలంగాణ లేదన్న వారికి సిగ్గు ఉండాలి.. జనం శాపనార్థాలు..!!

15 సంవత్సరాలుగా కోనప్ప ఎమ్మెల్యే పదవి వెలగబెట్టి ఏం సాధించావని భీమిని మండలం చిన్నగుడిపేట గ్రామస్తులు సైతం ప్రశ్నించారు.

by Venu

ఈ భూమి మీద ఏది శాశ్వతం కాదు అన్న సత్యం తెలియని వారు ఉండరు.. కానీ రాజకీయ నేతలు ఈ మాట అసలు డిక్షనరీలో ఉందా! అనేటట్టుగా ప్రవర్తిస్తున్నారని జనం అనుకుంటున్నారు. ఆవినీతిగా సంపాదించడానికి బీఆర్ఎస్ (BRS) పార్టీ అడ్డాగా మారిందని జనం ఆగ్రహిస్తున్నారు.. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన నేతలకు చుక్కలు చూపిస్తున్నారు ఓటర్లు.

 

తాజాగా కాగజ్‌ నగర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప (MLA Koneru Konappa) ఎన్నికల ప్రచారంలో భాగంగా కొమరం భీం (Komaram Bheem) ఆసిఫాబాద్ (Asifabad) జిల్లా దహేగం మండలం తెనుగుపల్లి గ్రామం వెళ్లారు.. అక్కడి స్థానికులు గ్రామానికి రోడ్డు వేయలేదని ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. మా గ్రామానికి రోడ్డు వేస్తానని హామీ ఇచ్చిన నాయకులు 15 సంవత్సరాలుగా రోడ్డు వేయడం లేదని ఆరోపించారు.

అభివృద్థి చేయడం చేతకాని నాయకులు ఓట్ల కోసం రావద్దంటూ ఎదురు తిరిగారు. మరోవైపు 15 సంవత్సరాలుగా కోనప్ప ఎమ్మెల్యే పదవి వెలగబెట్టి ఏం సాధించావని, భీమిని మండలం చిన్నగుడిపేట గ్రామస్తులు సైతం ప్రశ్నించారు. ఇదిలా ఉండగా రంగారెడ్డి (Rangareddy) జిల్లా, గండిపేట్ మండలం, వట్టినాగులపల్లి (Vattinagula Palli)లో బీఆర్ఎస్ నేతల ప్రచారాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు.

విప్రోలో భూములు కోల్పోయిన వారికి న్యాయం చేయలేని.. బీఆర్ఎస్ నాయకులు ఏ మొహం పెట్టుకొని ప్రచారానికి వస్తున్నారని స్థానిక ప్రజలు నిలదీశారు. డబుల్ బెడ్ రూమ్, దళితబంధు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలు మా గ్రామంలో అడుగుపెట్ట వద్దని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చూశారా ఇది బీఆర్ఎస్ ముఖచిత్రం.. కానీ ఏదో సాధించినట్టు.. బీఆర్ఎస్ లేకుంటే తెలంగాణ లేదని ప్రచారాలు చేసుకుంటున్న వారికి సిగ్గు ఉండాలని అవస్థలు పడుతున్న జనం శాపనార్థాలు పెడుతున్నారు..

You may also like

Leave a Comment