Telugu News » Election Commission : 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు.. ప్రతీచోటా మూడంచెల భద్రత..!

Election Commission : 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు.. ప్రతీచోటా మూడంచెల భద్రత..!

రాష్ట్రంలో 3 కోట్లకు పైగా ఓటర్లు ఉన్నారని చెప్పారు వికాస్ రాజ్. 18 ఏళ్ల వయసు వారు 3.06 శాతం ఉన్నారని తెలిపారు. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ ఉన్నారని చెప్పారు.

by admin
election-commission-ceo-vikas-raj-comments-on-telangana-polling-and-counting

తెలంగాణ (Telangana) లో పోలింగ్‌ ప్రశాంతంగా జరిగిందన్నారు సీఈవో వికాస్ రాజ్ (Vikas Raj). రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో 71.74 శాతం పోలింగ్‌ నమోదైందని తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. పోలింగ్, కౌంటింగ్ కు సంబంధించిన వివరాలు వెల్లడించారు. తెలంగాణలో రిపోలింగ్‌ కు ఎక్కడా అవకాశం లేదన్నారు. లక్షా 80 వేల మంది పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకున్నారని వివరించారు.

election-commission-ceo-vikas-raj-comments-on-telangana-polling-and-counting

యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 90.03 పోలింగ్‌ నమోదైందన్న వికాస్ రాజ్.. హైదరాబాద్‌ జిల్లాలో 46.68 శాతం ఓటింగ్ జరిగిందన్నారు. గతంలో కంటే ఈ ఎన్నికల్లో రెండు శాతం పోలింగ్‌ తగ్గిందని తెలిపారు. మునుగోడులో అత్యధికంగా 91.5 శాతం, యాకత్‌ పురలో అత్యల్పంగా 39.6 శాతం పోలింగ్‌ నమోదయినట్టు వివరించారు. 80 ఏళ్లు పైబడిన వారికి హోమ్‌ ఓటింగ్‌ కల్పించామని.. ఆదివారం 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుందని తెలిపారు.

రాష్ట్రంలో 3 కోట్లకు పైగా ఓటర్లు ఉన్నారని చెప్పారు వికాస్ రాజ్. 18 ఏళ్ల వయసు వారు 3.06 శాతం ఉన్నారని తెలిపారు. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ ఉన్నారని చెప్పారు. పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ పెట్టామని.. సీసీ కెమెరాలు.. 10 సెగ్మెంట్లకు ఒక సెక్టార్ పెట్టామని వివరించారు. దేవరకద్రలో పది మంది ఉన్నా కూడా పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు.

పలుచోట్ల ఈవీఎంల మార్పిడి జరిగిందని.. పార్టీల ఏజెంట్ల మధ్యనే స్ట్రాంగ్ రూమ్‌ కి తరలింపు జరిగిందని చెప్పారు. ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని.. ప్రతీ కౌంటింగ్ కేంద్రం దగ్గర మూడంచెల భద్రత ఉంటుందని తెలిపారు. ఓట్ల లెక్కింపు కోసం 1766 టేబుల్స్ ఉంటాయన్నారు వికాస్ రాజ్.

You may also like

Leave a Comment