Telugu News » Elon Musk: ఇజ్రాయెల్‌ – హమాస్‌ యుద్ధం.. ఎలాన్ మస్క్‌ సంచలన వ్యాఖ్యలు..!

Elon Musk: ఇజ్రాయెల్‌ – హమాస్‌ యుద్ధం.. ఎలాన్ మస్క్‌ సంచలన వ్యాఖ్యలు..!

ఇజ్రాయెల్- హమాస్‌ మధ్య యుద్ధం (Israel Hamas War) జరుగుతున్న వేళ గాజా(Gaza)లో భీకర వాతావరణం నెలకొంది.తాజాగా ఈ వ్యవహారంపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) స్పందించారు. హమాస్‌ సభ్యులను ఇజ్రాయెల్‌ పూర్తిగా హతమార్చడం లేదా ఖైదు చేయాలని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

by Mano
Elon Musk: Israel - Hamas war.. Elon Musk sensational comments..!

ఇజ్రాయెల్- హమాస్‌ మధ్య యుద్ధం (Israel Hamas War) జరుగుతున్న వేళ గాజా(Gaza)లో భీకర వాతావరణం నెలకొంది. హమాస్‌లను సమూలంగా అంతం చేసేందుకు కంకణం కట్టుకున్న ఇజ్రాయెల్ ఆ దిశగా గాజాపై విరుచుకుపడుతోంది. ప్రపంచ దేశాలన్నీ ఈ యుద్ధంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ యుద్ధంలో సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన చెందుతున్నాయి.

Elon Musk: Israel - Hamas war.. Elon Musk sensational comments..!

తాజాగా ఈ వ్యవహారంపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) స్పందించారు. హమాస్‌ సభ్యులను ఇజ్రాయెల్‌ పూర్తిగా హతమార్చడం లేదా ఖైదు చేయాలని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. లెక్స్‌ ఫ్రిడ్‌మన్‌ అనే అమెరికన్‌ పాడ్‌కాస్ట్‌ షోలో మాట్లాడుతూ ఎలాన్ మస్క్ x(ట్విట్టర్) వేదికగా ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

పశ్చిమాసియాలో సంక్లిష్ట పరిస్థితుల కారణంగా ఇజ్రాయెల్‌ – హమాస్‌ యుద్ధంపై తలెత్తున్న ప్రశ్నలకు సమాధానాలు దొరకడం కష్టమని ఎలాన్ మస్క్ అన్నారు. సైనికపరంగా ఇజ్రాయెల్‌ విజయం సాధిస్తుందని హమాస్‌ ఊహించలేకపోయిందని వ్యాఖ్యానించారు.

ఈ యుద్ధం ఆగాలంటే.. హమాస్ సభ్యులను చంపడమే లేదా జైళ్లలో పెట్టడమో చేయాలని సూచించారు. ఇది పూర్తిగా తన వ్యక్తిగత అభిప్రాయమని మస్క్ చెప్పుకొచ్చారు. అలా చేయకపోతే ఆ ఉగ్రవాదులు మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటారని తెలిపారు. ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తూనే ఉంటారన్న తన ఉద్దేశాన్ని మస్క్ ఈ విధంగా చెప్పుకొచ్చారు.

You may also like

Leave a Comment