Telugu News » Telangana : సారూ.. జీతాలెప్పుడు?

Telangana : సారూ.. జీతాలెప్పుడు?

నిజానికి ప్రతిపక్షాల వాదనలో నిజం లేకపోలేదు. ప్రతీ నెలా ఒకటో తారీఖున రావాల్సిన జీతాలు.. కొన్ని శాఖల్లో మూడో వారానికిగానీ అందని దుస్థితి నెలకొంది.

by admin
employees Waiting for salaries

బంగారు తెలంగాణ కేసీఆర్ (KCR) నినాదం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు సాధనలో దీన్ని గట్టిగా వాడేశారు. అయితే.. అధికారం సాధించాక బంగారు తెలంగాణ నినాదం కాస్త బోగస్ తెలంగాణగా మారిందనే విమర్శలు ఉన్నాయి. కేవలం కేసీఆర్ కుటుంబమే బంగారు మయం అయిందని ప్రతిపక్షాలు (Opposition Parties) తరచూ తిట్టిపోస్తున్నాయి. ఉద్యోగులకు సరైన టైమ్ లో జీతాలు ఇవ్వలేని కేసీఆర్ ను ఈసారి గద్దె దించాలని జనంలోకి వెళ్తున్నాయి.

employees Waiting for salaries

నిజానికి ప్రతిపక్షాల వాదనలో నిజం లేకపోలేదు. ప్రతీ నెలా ఒకటో తారీఖున రావాల్సిన జీతాలు (salaries).. కొన్ని శాఖల్లో మూడో వారానికిగానీ అందని దుస్థితి నెలకొంది. 13వ తారీఖు వచ్చినా ఇప్పటికీ చాలా శాఖల్లోని ఉద్యోగులకు జీతాలు అందలేదు. రాష్ట్ర స్థాయి కేడర్ నుంచి మొదలుకుంటే.. నాలుగో తరగతి, సబార్డినేట్ ఉద్యోగులకు కూడా నెలనెలా సరిగ్గా జీతాలు అందడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

ఉమ్మడి కరీంనగర్‌ (Karimnagar) జిల్లానే చూస్తే.. దాదాపు 12 వేల మందికిపైగా ఉపాధ్యాయులు, 12వేల మందికి పైగా ఇతర ఉద్యోగులు, 16 వేల మందికి పైగా పెన్షనర్లు ఉన్నారు. వీరికి ప్రతినెలా ఒకటో తేదీన ప్రభుత్వం వేతనాలు జమ చేయాలి. కానీ, 15వ తేదీకి కూడా వారి బ్యాంక్‌ ఖాతాల్లో జమ కావడం లేదు. ఆర్థిక ఇబ్బందులే ఇందుకు కారణమని ప్రచారం జరుగుతోంది. చాలా జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొందని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి.

ఆర్థిక శాఖలోని ఉన్నతాధికారుల అలసత్వం వల్లే జీతాల జాప్యం జరుగుతోందనేది ఉద్యోగ సంఘాల నాయకుల ఆరోపణ. ఆర్థిక సంక్షోభం ఏర్పడింది వాస్తవమే అయినా.. దాన్నే కారణంగా చూపి వేతనాలు, పింఛన్‌ ఆలస్యంగా ఇవ్వడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. జీతాల చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఉద్యోగులు వాపోతున్నారు. బ్యాంకుల నుంచి గృహ, వాహన, వ్యక్తిగత రుణాలకు.. సరైన టైంలో కిస్తీలు చెల్లించలేకపోతున్నామని చెబుతున్నారు. ఒక్కోసారి బ్యాంకుల్లో చెక్కులు బౌన్స్‌ అయి ఫైన్ కట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

You may also like

Leave a Comment