పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు దూకుడును పెంచారు. కొందరు ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడుగుతుంటే మరికొందరు డిజిటల్, సోషల్ మీడియాను ప్రచార సాధనాలుగా వాడుకుంటున్నారు. మరికొందరు టీవీ ఛానెల్స్ డిబెట్స్‌లో పాల్గొని ఓటర్ల నాడిని పట్టుకునేందుకు ఏదో ఒక అంశాన్ని ఎంచుకుని మాట్లాడుతున్నారు.
ఈ క్రమంలోనే బీజేపీ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాధవీలత(BJP MP CONTESTANT MADAVI LATHA) ఏకంగా ఎంఐఎం(MIM) కంచుకోటగా భావించే హైదరాబాద్ ఎంపీ సెగ్మెంట్‌పై కాషాయ జెండా పాతడానికి తీవ్రంగా శ్రమిస్తోంది. సోషల్ మీడియాలో ఆమె చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.
తాజాగా ‘ఆప్ కి అదాలత్’ (AAP LI ADALATH)అనే షోలో మాధవీలత పాల్గొనగా.. దానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ శనివారం రాత్రి ప్రసారమైంది. దీనిని వీక్షించిన ప్రధాని మోడీ మాధవీలతను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ఇదే దూకుడుతో ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని ఆమెకు సూచించారు. అంతేకాకుండా ఈ ఎపిసోడ్‌ను వీక్షించాలని, ఇది ఎంతో గానో సమాచారపూర్వకంగా ఉందని ఆయన పేర్కొన్న విషయం తెలిసిందే.
ఆ షోలో భాగంగా సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూతో పోల్చిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై మీ స్పందన ఏమిటని ఇంటర్వ్యూ చేసే పర్సన్ అడుగగా.. ఆమె చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.‘ స్టాలిన్ గారు ముందుగా మీ తల్లి, మీ భార్యను పూజలు చేయకుండా ఆపండి. ముందుగా మీ ఇంట్లోని పూజ గదిని ఖాళీ చేయించండి’ అంటూ మాధవీ లత సవాల్ విసిరారు. భారత్‌లో సనాతన ధర్మాన్ని ఎవరూ అసహ్యించుకోలేరు అంటూ ఆమె స్పష్టంచేశారు.