వాస్తవాలు మాట్లాడితే కేసీఆర్(CM KCR) దబాయిస్తారని గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్(Etala Rajender) కీలక వ్యాఖ్యలు చేశారు. కాళ్ళ కింద భూమి కదులుతోన్న విషయాన్ని ఆయన గ్రహించరని, సీఎం కేసీఆర్ తనకు తాను ఎక్కువగా ఊహించుకుంటారని ఆరోపించారు. నిజాలను తెలుసుకోవటానికి కేసీఆర్ ఇష్టపడరని తెలిపారు.
బషీర్‌భాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడారు. హైదరాబాద్ చుట్టుపక్కల 5,800 ఎకరాల భూమిని అభివృద్ధి పేరిట అతి చౌక ధరలకు కేసీఆర్ కుటుంబం తీసుకుందన్నారు. ఒక్క గజ్వేల్ లోనే 30వేల మంది కేసీఆర్ బాధితులున్నారని తెలిపారు. బీఆర్ఎస్‌ను ఎదుర్కొనే సత్తా బీజేపీకి మాత్రమే ఉందన్నారు ఈటల. కేసీఆర్ అడుగులకు మడుగులు వత్తే వారికే బీసీబంధు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హంగ్ వస్తే.. బీఆర్ఎస్, కాంగ్రెస్ కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయన్నారు. గతంలో కలసి పనిచేసిన చరిత్ర కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు ఉన్నాయన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటైతే తాను గజ్వేల్‌లో ఎందుకు పోటీ చేస్తాను? అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ గతంలో ఎప్పుడూ కలసి పోటీ చేయలేదన్నారు. బీజేపీపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాళ్ళ కింద భూమి కదులుతోన్న విషయాన్ని కేసీఆర్ గ్రహించడం లేదన్నారు ఈటల.
వాస్తవాలు చెప్తే కేసీఆర్ దబాయింపుతో వ్యవహరిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్ళు, నియామకాల విషయంలో కేసీఆర్ సంపూర్ణంగా విఫలమైందన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి మాదిరి కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంకుచిత మనస్తత్వం ఉన్నవారికి కాదు.. బ్రాడ్‌గా ఆలోచించే వారికే తానేంటో తెలుస్తుందన్నారు. నాయకులు పార్టీలు మారడం కేవలం రాజకీయ భవిష్యత్తు కోసమేనని తెలిపారు.
బీఆర్ఎస్ ఉన్నంత కాలం కేసీఆర్ కుటుంబమే సీఎం పదవి చేపడతారని, కాంగ్రెస్‌లో ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ ముఖ్యమంత్రి లేరన్నారు. బీజేపీ మాత్రమే బీసీ ముఖ్యమంత్రిని చేస్తుందన్నారు. గజ్వేల్, హుజురాబాద్ తనకు రెండు కళ్లని వ్యాఖ్యానించారు. 1600 ఓట్లు ఉన్న బీజేపీని హుజురాబాద్ ప్రజలు లక్షా 7వేల ఓట్లు ఇచ్చి గెలిపించారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 61సీట్లకు పైనే వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.