Telugu News » BRS EX MLA : వేట మొదలైంది.. ఒక్కొక్కరి సంగతి చూస్తా.. బీఆర్ఎస్ నేత..!!

BRS EX MLA : వేట మొదలైంది.. ఒక్కొక్కరి సంగతి చూస్తా.. బీఆర్ఎస్ నేత..!!

బీఆర్ఎస్ పథకాలు కాపీ కొడుతోన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. మనం చేసిన అభివృద్ధి పథకాలను పంపిణీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ చెప్పిన ఆరు గ్యారెంటీ పథకాలు ఒక్కటి కూడా ముందుకు కొనసాగవని శంకర్ నాయక్ విమర్శించారు.. త్వరలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని కార్యకర్తలను ఉద్దేశించి శంకర్ నాయక్ వ్యాఖ్యానించారు.

by Venu

రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి రావడం కొందరు బీఆర్ఎస్ (BRS) నేతలు జీర్ణించుకోలేక పొతోన్నట్టు ప్రచారం జరుగుతోంది. బయటికి చెప్పుకోలేకపోతోన్న లోలోపల రగిలిపోతోన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు తెలంగాణలో తనదైన ముద్ర ఉండేలా హస్తం ప్రభుత్వం వ్యూహాలు పన్నుతోన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ సంచలన వాఖ్యలు చేశారు.

మహబూబాబాద్ జిల్లా గూడూరులో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న శంకర్ నాయక్ తన ఓటమి పై కీలక వ్యాఖ్యలు చేశారు.. సొంత పార్టీలోనే ఉంటూ వెన్నుపోటు పొడిచి, తన ఓటమికి కారణం అయిన ఒక్కొక్కరి సంగతి చూస్తానని హెచ్చరించారు. ఇప్పటికే నాకు 54 సంవత్సరాలు దాటాయి. బతికిన కాడికి చాలు. ఇక శంకర్ నాయక్ వేట మొదలైంది. నా సత్తా ఏంటో చూపిస్తానని హెచ్చరించారు.

శంకర్ నాయక్ అంటే ఏంటో ఉమ్మడి వరంగల్ జిల్లాకి మొత్తం తెలుసు. నన్ను ఆపే శక్తి ఎవరికీ లేదన్న బానోత్ శంకర్ నాయక్ (Banoth Shankar Naik)..మండల నాయకులు చెప్పినా వినకుండా.. ఎంపీపీ, జడ్పీటీసీల పేర్లను ప్రతిపాద చేసి తప్పు చేశాను, నన్ను క్షమించండని అన్నారు.. అందరూ కలిసికట్టుగా శ్రమిస్తే మళ్లీ మన పార్టీ అధికారంలోకి రావడం జరుగుతోందని శంకర్ నాయక్ పేర్కొన్నారు..

బీఆర్ఎస్ పథకాలు కాపీ కొడుతోన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. మనం చేసిన అభివృద్ధి పథకాలను పంపిణీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ చెప్పిన ఆరు గ్యారెంటీ పథకాలు ఒక్కటి కూడా ముందుకు కొనసాగవని శంకర్ నాయక్ విమర్శించారు.. త్వరలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని కార్యకర్తలను ఉద్దేశించి శంకర్ నాయక్ వ్యాఖ్యానించారు.

మరోవైపు శంకర్ నాయక్ చేసిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో వివాదస్పదంగా మారాయి.. ప్రజల మనస్సు గెలిచి అధికారంలోకి రావాలే కానీ బెదిరించుకొని పదవులు పొందాలని చూడటం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు..

You may also like

Leave a Comment