బీఆర్ఎస్ (BRS) మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి (Gandra Venkanta Ramana Reddy) భూపాలపల్లిలో నిర్మించిన వేకటేశ్వర స్వామి ఆలయం (Venkateswara Swamy temple) నిర్మాణం పై వస్తున్న ఆరోపణలకు స్పందించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.. గెలిచిన ఎమ్మెల్యే గుడిపై రాజకీయం చేయడం మానుకోవాలని సూచించారు..
భూపాలపల్లి (Bhupalpalli)లో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న గండ్ర.. వేంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి జరుగుతోన్న నిర్మాణాలను నిలిపివేయాలని మున్సిపల్, రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చినట్టు తెలిపారు.. అయితే వీటిపై హైకోర్టులో పిల్ వేయగా.. పరిశీలించిన కోర్టు నోటీసులను రద్దు చేసిందన్నారు.. నిర్మాణాలు జరుపుకోవడానికి అనుమతినిచ్చిందన్న విషయాన్ని గుర్తు చేశారు..
వేంకటేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపన, విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాల్లో కలెక్టర్‌తో పాటు రెవెన్యూ అధికారులందరూ పాల్గొన్నారని తెలిపిన గండ్ర వెంకట రమణారెడ్డి.. అధికారులందరికి ప్లాన్ తెలుసని అన్నారు.. గుడి నిర్మాణాలన్నీ అధికారులకు తెలిసే జరిగాయని, తానేమీ దాచలేదని వివరించారు.. కావాలని ఇలాంటి పనులు చేస్తున్నట్టు విమర్శించారు..
ఆలయం పనులు మొదలు పెట్టిన ఏడాది తర్వాత అక్రమ నిర్మాణాలని, అనుమతులు లేవని, స్థలానికి సంబంధించి కేసు కోర్టులో ఉందని చెప్పడం విడ్డూరంగా ఉందని గండ్ర మండిపడ్డారు.. గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యక్తిగత కుట్ర రాజకీయాలకు తెరలేపుతున్నారన్నారని ఆరోపించారు.. ఇకనైనా ఆలయంపై కుట్రలు ఆపాలని వెంకట రమణారెడ్డి హితవు పలికారు..