Telugu News » Jagga reddy : హరీశ్ రావు ఆ డబ్బు ఎక్కడ దాచారో వెలికి తీయాలి…. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు….!

Jagga reddy : హరీశ్ రావు ఆ డబ్బు ఎక్కడ దాచారో వెలికి తీయాలి…. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు….!

2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు హరీశ్ రావు (Harish Rao) సీఎం పదవి కోసం రూ.5 వేల కోట్లు సిద్ధం చేసి పెట్టుకున్నారని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

by Ramu
ex mla jaggareddy made sensational allegations against brs leader harish rao

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jagga Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు హరీశ్ రావు (Harish Rao) సీఎం పదవి కోసం రూ.5 వేల కోట్లు సిద్ధం చేసి పెట్టుకున్నారని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

ex mla jaggareddy made sensational allegations against brs leader harish rao

ఆ మొత్తం డబ్బును ఎక్కడ దాచిపెట్టారో వెలికి తీయాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాస్తా అని అన్నారు. మీడియాతో శనివారం జగ్గారెడ్డి మాట్లాడుతూ….. అధికారాన్ని అడ్డం పెట్టుకొని గతంలో హరీశ్ రావు, కేటీఆర్, కవిత, సంతోష్ రావులు వేల కోట్లు దండుకొని దాచి పెట్టుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.

వారిలో ఏ ఒక్కరిని కూడా వదిలి పెట్టబోమని.. బీఆర్ఎస్ హయాంలో అవినీతికి పాల్పడిన అందరి బాగోతాన్ని బయట పెడతామని హెచ్చరించారు. హరీశ్ రావు, కేటీఆర్ పెద్ద డ్రామా ఆర్టిస్ట్ అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రివ్యూలు చేస్తుంటే హరీశ్ రావుకు నిద్ర పట్టడం లేదన్నారు.

తిట్ల పురాణానికి కేసీఆర్ గురువు అయితే అందులో కాంగ్రెస్ వాళ్లు కేసీఆర్‌కే గురువని పేర్కొన్నారు. బాల్క సుమన్‌కి తెలివి లేదని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. మరోసారి బాల్క సుమన్ మాట్లాడితే నేరుగా వెళ్లి కొడతామని తీవ్ర హెచ్చరికలు చేశారు.

You may also like

Leave a Comment