Telugu News » Sabarimala : శబరిమలలో తీవ్ర ఉద్రిక్తత.. అయ్యప్ప భక్తులపై లాఠీ ఛార్జ్..!!

Sabarimala : శబరిమలలో తీవ్ర ఉద్రిక్తత.. అయ్యప్ప భక్తులపై లాఠీ ఛార్జ్..!!

శబరిమలలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయ్యప్ప భక్తులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. నిన్న రాత్రి నుంచి రద్దీ దృష్ట్యా శబరిమల మార్గం మధ్యలో అయ్యప్ప స్వాములను పోలీసులు నిలిపివేశారు. తాళ్లను అడ్డుకట్టి వారిని గంటల తరబడి నిలిపివేయడంతో.. ఆగ్రహించిన భక్తులు చిన్నపిల్లలు ఉన్నారని, ఇంకెంతసేపు నిల్చోవాలంటూ వాదనకి దిగినట్టు సమాచారం..

by Venu

ప్రతిష్ఠాత్మక పుణ్యక్షేత్రం శబరిమల (Sabarimala) ఈ మధ్య వివాదాలతో తరచుగా వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే అయ్యప్ప భక్తుల (Ayyappa Devotees) విషయంలో కేరళ ప్రభుత్వం (Kerala Govt) తీరు విమర్శలకి దారితీస్తోంది. భక్తుల రద్దీ వల్ల శబరిమలలో మౌలిక సదుపాయాలు కరువయ్యాయి. క్యూ లైన్లలో గంటల తరబడి నిల్చోవాల్సి వస్తుంది. దర్శనానికి సుమారు 10 గంటలకు పైగా పడుతున్నదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో శబరిమలలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయ్యప్ప భక్తులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. నిన్న రాత్రి నుంచి రద్దీ దృష్ట్యా శబరిమల మార్గం మధ్యలో అయ్యప్ప స్వాములను పోలీసులు నిలిపివేశారు. తాళ్లను అడ్డుకట్టి వారిని గంటల తరబడి నిలిపివేయడంతో.. ఆగ్రహించిన భక్తులు చిన్నపిల్లలు ఉన్నారని, ఇంకెంతసేపు నిల్చోవాలంటూ వాదనకి దిగినట్టు సమాచారం.. దీంతో అయ్యప్ప భక్తులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారుని వార్తలు వస్తున్నాయి.

మరోవైపు సుమారు 18 కంపార్ట్మెంట్లలో అయ్యప్ప స్వాములు దర్శనం కోసం వేచి ఉన్నారు. దర్శనానికి 10 గంటలపైనే పడుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలో కనీసం త్రాగడానికి మంచినీరు కూడా ట్రావెన్ కోర్ దేవస్థాన బోర్డు అందించలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే శబరిమలలో అయ్యప్ప భక్తుల పట్ల అక్కడి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి..

అదీగాక కోవిడ్ కేసులు కేరళలో బయటపడుతున్న నేపథ్యంలో ఇలా భక్తులు మాస్క్ లు లేకుండా ఉండటం.. ఈ విషయంలో కేరళ ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టక పోవడం తీవ్ర విమర్శలకి దారితీస్తుంది. మరోవైపు భక్తుల పట్ల ట్రావెన్ కోర్ దేవస్థాన బోర్డు (Travan Core Temple Board) ప్రవర్తిస్తున్న తీరుపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి..

You may also like

Leave a Comment