నేటి సమాజంలో భార్య భర్తల బంధం ఓ టిష్యూ పేపర్ లా మారిందని లోకం గగ్గోలు పెడుతుంది. మూడు ముళ్ళు ఏడడుగులతో ముడిపడిన బంధం నలుగురిలో నవ్వులపాలు అవుతుందని పెద్దలు విచారం వ్యక్తం చేస్తున్నారు.. అయినా ఏమార్పు కనిపించడం లేదు వివాహ బంధంలో అని కన్న తల్లిదండ్రులు మధనపడుతున్న దృశ్యాలు ఎన్నో కనిపిస్తున్నాయి లోకంలో..
ఇప్పటికే ఫేస్ బు (Facebook) ఇన్‌స్టాగ్రామ్ (Instagram) వంటి సోషల్ మీడియా (Social media) సాధనాలు జీవితాలని శాసిస్తున్నాయి. ఈ క్రమంలో అప్పటికే పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్న అంజు అనే మహిళ.. ఫేస్ బుక్ లో పరిచయమైన వ్యక్తిని ప్రేమించి, పెళ్లాడేందుకు పాకిస్థాన్ వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే పిల్లల కోసం అంజు (Anju) భారత్ కు తిరిగి రానుందని సమాచారం.
ఇందుకోసం పాకిస్థాన్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుందని, పర్మిషన్ రాగానే రాజస్థాన్ కు వస్తుందని ఆమె పాక్ భర్త నస్రుల్లా తెలిపారు. కూతురు కొడుకును చూసి తిరిగి పాకిస్థాన్ వస్తుందని నస్రుల్లా చెప్పారు. మరోవైపు రాజస్థాన్ కు చెందిన 34 ఏళ్ల అంజు పాకిస్థాన్ యువకుడు నస్రుల్లా (29)ను ప్రేమించి, అతడి కోసం ఆగస్టులో వాఘా బార్డర్ దాటి పాకిస్థాన్ లో అడుగుపెట్టింది.
అక్కడ అంజు మతం మార్చుకుని ఫాతిమాగా మారింది. కాగా అంజుకి ఇప్పటికే భర్తతో పాటు 15 ఏళ్ల కూతురు, ఆరేళ్ల కొడుకు ఉన్నారు.. ఏంటో కలికాలం ఆడవారు కూడా భర్తలు బతికి ఉండగానే వారిని ఖర్చీఫ్ లని మార్చినట్టు మార్చడం అని ఈ ముచ్చట తెలిసిన పెద్దమనుషులు అనుకుంటున్నారు..