Telugu News » Bharat : ఏ రాష్ట్రంలో ఎన్ని ఆలయాలు ఉన్నాయో తెలుసా..?

Bharat : ఏ రాష్ట్రంలో ఎన్ని ఆలయాలు ఉన్నాయో తెలుసా..?

ఆ సేతు హిమాచలం మన సాంస్కృతిక వైభవాన్ని వారసత్వంగా అందిస్తున్న ప్రముఖ దేవాలయాలు.. ఏ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయో తెలుసా..? టాప్ 12 రాష్ట్రాలకు సంబంధించిన వివరాలను ‘రాష్ట్ర’ అందిస్తోంది.

by admin
tamilnadu temples

భారతదేశ (Bharat) ఆధ్యాత్మిక చరిత్ర.. హిందూ (Hindu) దేవాలయాలతో ముడిపడి ఉంది. ఎన్నో పురాతన దేవాలయాలు (Temples) మన సాంస్కృతిక వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి. సంప్రదాయాలకు పట్టుకొమ్మల్లాంటి దేవాలయాలు.. ఎంతో అందంగా అబ్బురపరిచే.. ఆధ్యాత్మిక, ఇతిహాస గాథలను ప్రస్ఫూటకరిస్తాయి. అందుకే, మన దేశాన్ని దేవాలయాల భూమిగా పిలుస్తారు. ఇక్కడ ప్రతి 3 కిలోమీటర్లకు ఒక దేవాలయం కచ్చితంగా కనిపిస్తుంటుంది.

kashi-vishwanath-temple

భారతీయులు ఆధ్యాత్మిక చింతనలో దేవాలయాలను దర్శించుకోవడం రోజువారీ ఆచారం. ఎన్నో ఏళ్ల నుంచి ఇది కొనసాగుతోంది. అద్భుతమైన శిల్పాలతో శతాబ్దాల నాటి ఆలయాలు ఇప్పటికీ దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. వాటిలో తప్పక సందర్శించాల్సిన ఆలయాలు చాలానే ఉన్నాయి. ఆ సేతు హిమాచలం మన సాంస్కృతిక వైభవాన్ని వారసత్వంగా అందిస్తున్న ప్రముఖ దేవాలయాలు.. ఏ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయో తెలుసా..? టాప్ 12 రాష్ట్రాలకు సంబంధించిన వివరాలను ‘రాష్ట్ర’ అందిస్తోంది.

Badrinath-Temple

దేశంలో ఆలయాల రాష్ట్రంగా ప్రసిద్ధి చెందింది తమిళనాడు. ఇక్కడ 79,154 దేవాలయాలు ఉన్నాయి. వివిధ రకాల దేవుళ్లు కొలువై భక్తులతో పూజలందుకుంటున్నారు.

tamilnadu temples

తమిళనాడు తర్వాత మహారాష్ట్ర రెండోస్థానంలో ఉంది. ఇక్కడ, 77,283 ఆలయాలు ఉన్నాయి. నిత్యం భక్తులతో ఇవి కిటకిటలాడుతుంటాయి.

maharashtra temples

కర్ణాటకలో 66,465 ఆలయాలు ఉన్నాయి.

karnataka temples

పశ్చిమ బెంగాల్ లో 58,876 దేవాలయాలు ఉన్నాయి.

west bengal temples

ఆంధ్రప్రదేశ్ లో 56,890 ఆలయాలు ఉన్నాయి.

andhra temples

గుజరాత్ లో 49, 984 దేవాలయాలు ఉన్నాయి.

gujarat temples

హిమాచల్ ప్రదేశ్ లో 42,652 ఆలయాలు ఉన్నాయి.

himachal temples

రాజస్థాన్ లో 38,955 దేవాలయాలు ఉన్నాయి.

rajastan temples

ఒడిశాలో 31,780 ఆలయాలు ఉన్నాయి.

odisha temples

తెలంగాణలో 28,576 దేవాలయాలు ఉన్నాయి.

telangana temples

మధ్యప్రదేశ్ లో 28,050 ఆలయాలు ఉన్నాయి.

madhya pradesh temples

కేరళలో 22,848 దేవాలయాలు ఉన్నాయి.

kerala temples

ఇవేకాదు, మిగిలిన రాష్ట్రాల్లో కూడా ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తున్నాయి.

You may also like

Leave a Comment