Telugu News » Love Jihad: గుజరాత్ లో మరో లవ్ జిహాద్ కేసు…. హైదరాబాద్‌లో హిందు వుగా చెప్పుకుంటూ…..!

Love Jihad: గుజరాత్ లో మరో లవ్ జిహాద్ కేసు…. హైదరాబాద్‌లో హిందు వుగా చెప్పుకుంటూ…..!

ఫరీద్ షా అనే యువకుడు తన పేరు ఆశీష్ అని చెప్పుకుంటూ బేగంపేట హాకీ స్టేడియంలో నిర్వహించిన గార్బా వేడుకల్లో వెళ్లేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నట్టు తెలిపారు.

by Ramu

హిందువు(Hindu)గా చెప్పుకుంటు గార్బా (Garba) వేడుకల్లో పాల్గొనేందుకు ప్రయత్నించిన ముస్లిం యువకున్ని భజరంగదళ్ (Bajrangdal) కార్యకర్తలు అడ్డుకున్నారు. ఫరీద్ షా అనే యువకుడు తన పేరు ఆశీష్ అని చెప్పుకుంటూ బేగంపేట హాకీ స్టేడియంలో నిర్వహించిన గార్బా వేడుకల్లో వెళ్లేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నట్టు తెలిపారు. ఓ హిందూ యువతి కోసం అతను అక్కడికి వచ్చినట్టు చెప్పారు. దీంతో మరో లవ్ జిహాద్ కేసు జరగకుండా అడ్డుకున్నట్టు చెప్పారు.

 

దానికి సంబంధించిన వీడియోను హైదరాబాద్ జిల్లా బీజేపీ లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ అటార్నీ నీలం భార్గవ్ రామ్ షేర్ చేశారు. హిందూ ధర్మ రక్షక్ రాజాసింగ్ హెచ్చరించిన పరిణామాలే జరుగుతున్నాయని చెప్పారు. హైదరాబాద్‌లో తన గుర్తింపును దాచిపెట్టి ఒక ముస్లిం వ్యక్తి దాండియా కార్యక్రమంలోకి ప్రవేశించగా, హిందూ యువకులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారని వెల్లడించారు.

ఆ వీడియోలో ముస్లిం యువకున్ని ఐడెంటిటీ ప్రూఫ్ చూపించాలని భజరంగ్ దళ్ కార్యకర్తలు అడగటం కనిపిస్తోంది. ఆశీష్ అనే పేరుతో ఎందుకు గార్బా వేడుకలకు వస్తున్నావని ప్రశ్నించడం మనం చూడవచ్చు. ఆ యువకుని ప్రశ్నించి అతని వివరాలను సేకరించిన అనంతరం అతన్ని బేగంపేట్ పోలీసులకు భజరంగ్ దళ్ కార్యకర్తలు అప్పగించారు.

మరోవైపు గుజరాత్‌లో లవ్ జిహాద్‌ కేసు వెలుగులోకి వచ్చింది. తాజాగా దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో వివరాల ప్రకారం….. భుజ్ సిటీలో ఫిరోజ్ అనే వ్యక్తి జానకి అనే హిందూ యువతిని ట్రాప్ చేశాడు. ప్రేమ పేరుతో వల వేసి వివాహం చేసుకున్నాడు. అనంతరం బలవంతంగా ఆమెను ఇస్లాంలోకి మారేలా చేశాడు. ఆ తర్వాత ఆమెను మాదక ద్రవ్యాల వ్యాపారం చేసేలా ఒత్తిడి చేసేవాడు.

ఇతర వ్యక్తులతో సంబంధాలు కొనసాగించాలని ఆమెపై ఒత్తిడి తీసుకు వచ్చాడు. దానికి యువతి ఒప్పుకోక పోవడంతో ఆమెను ఫిరోజ్ క్రూరంగా హింసించే వాడు. తాజాగా దానికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో బాధిత యువతి స్పందించారు. వీడియోలో చెప్పిన విషయాలన్నీ నిజమేనని ఆమె వెల్లడించారు.

You may also like

Leave a Comment