Telugu News » Sudden Rains : రైతుపై పగబట్టిన ప్రకృతి.. ఆందోళనలో అన్నదాతలు..!!

Sudden Rains : రైతుపై పగబట్టిన ప్రకృతి.. ఆందోళనలో అన్నదాతలు..!!

ప్రకృతి (Nature) రైతును పగపట్టినట్టు అకాల వర్షాలు (Sudden Rains) కురిపిస్తుంది. రైతు కష్టాన్ని నీటిపాలు చేస్తుంది. మొన్నటి వరకు సరిగ్గా వానలు లేక బాధపడ్డ రైతు.. ఇప్పుడు కురుస్తున్న అకాల వర్షాలతో ఆవేదన చెందుతున్నాడు. ఇప్పటికే అకాల వర్షం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రైతులను నిండా ముంచుతోంది

by Venu

జై జవాన్.. జై కిసాన్.. అనే నినాదం ఒకప్పుడు నిత్యం వినిపించేది.. దేశానికి జవాన్ ఎంత అవసరమో.. రైతు (Farmers) కూడా అంతే అవసరం. కానీ నేటి కాలంలో రైతుకు భరోసా.. భద్రత ఇచ్చేవారే కరువైయ్యారని కంటనీరు పెట్టని రైతు లేడు.. ఈ సృష్టిలో జీవించే ప్రతి ప్రాణికి ఆహారం అవసరం.. కానీ ఆహారం ఉత్పత్తి చేసే రైతు వ్యధ ఎవరికి అవసరం లేనట్టుగా లోకం మారిందని ఆరోపణలు వస్తున్నాయి. ఇక రాజకీయ నాయకుల (Politicians) కపట ప్రేమల వల్ల బాగుపడిన రైతు లేడన్నది జగమెరిగిన సత్యం..

మరోవైపు ప్రకృతి (Nature) రైతును పగపట్టినట్టు అకాల వర్షాలు (Sudden Rains) కురిపిస్తుంది. రైతు కష్టాన్ని నీటిపాలు చేస్తుంది. మొన్నటి వరకు సరిగ్గా వానలు లేక బాధపడ్డ రైతు.. ఇప్పుడు కురుస్తున్న అకాల వర్షాలతో ఆవేదన చెందుతున్నాడు. ఇప్పటికే అకాల వర్షం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రైతులను నిండా ముంచుతోంది. అపార నష్టం కలిగిస్తుంది. కాగా మంచిర్యాల (Manchryala) జిల్లా చెన్నూర్ (Chennur) మండలంలో అకాల వర్షం కారణంగా పలుచోట్ల ఉన్న వడ్ల కొనుగోలు సెంటర్లలో ధాన్యం తడిచిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

గత మూడు రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాల కారణంగా కిష్టంపేట గ్రామంలోని వడ్ల కొనుగోలు సెంటర్‌లో ఆరబెట్టిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. తడిసిన ధాన్యం అరడానికి పది నుంచి పదిహేను రోజుల సమయం పడుతుందని, ధాన్యం కాంట వేయడానికి మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమను ఆదుకోవాలంటూ అధికారులను వేడుకుంటున్నారు.

మహబూబాబాద్‌లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. భారీ వర్షం ధాటికి రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దవడంతో అన్నదాతలు ఆందోళన పడుతున్నారు. అన్ని కష్టాలకు ఓర్చుకుని పండించిన పంట నీటి పాలవుతుంటే కడుపు తరుక్కుపోతుందని విలపించే రైతులు కూడా కనిపిస్తున్నారు.. కాగా ఈ వర్షాలు మరో మూడు రోజుల పాటు ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడిస్తుంది. తెలంగాణలో మోస్తరు నుంచి సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి సంస్థ తెలిపింది.

You may also like

Leave a Comment