దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో రైతుల నిరసన(Farmers Protest) కొనసాగుతోంది. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేరుస్తామని స్పష్టమైన హామీ ఇచ్చే వరకూ ఢిల్లీని వదిలి వెళ్లే ప్రసక్తేలేదని తేల్చిచెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ, పంజాబ్-హర్యానా సరిహద్దుల్లోనే మకాం వేశారు.
కావాల్సిన సరుకులను వెంట తెచ్చుకుని వంటావార్పు(Cooking) చేసుకుంటున్నారు. అక్కడే వండుకుతిని గుడారాల్లో తలదాచుకుంటున్నారు. రైతుల డిమాండ్లపై చర్చకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమేనని అంటోంది. అయితే కొందరు మాత్రం చర్చలకు పిలుస్తూనే తాత్సారం చేస్తోందని కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు.
పోలీసులు గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని పరిస్థితి చేయిదాటకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే వరకు కదలమని రైతులు భీష్మించి కూర్చున్నారు. ఢిల్లీ బార్డర్‌లోనే తిష్టవేశారు.
పంజాబ్-హర్యానా నడుమగల శంభు సరిహద్దులో రైతులు వాహనాలపైనే వంట చేసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాము పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని, గత ఆందోళనల సందర్భంగా తమపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.
VIDEO | Farmers' protest: Food being prepared at Punjab-Haryana Shambhu border. pic.twitter.com/r4uiI2RihO
— Press Trust of India (@PTI_News) February 24, 2024