అఖిల భారత వర్కింగ్ జర్నలిస్టు సంఘం, తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో నూతన ప్రభుత్వా (Governament)న్ని అభినందిస్తూ రవింద్ర భారతీ లో సభను నిర్వహించనున్నారు. ఈ సభకు రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivs Reddy), మహిళా శిశు సంక్షేమ, గిరిజన అభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్కలు హాజరుకానున్నారు.
ఈ సభను తెలంగాణ వ్యాప్తంగా వున్న అఖిల భారత వర్కింగ్ జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు, తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘ రాష్ట్ర, జిల్లా, మండల ప్రతినిధులందరూ విధిగా హజరుకావాలని జర్నలిస్టు సంఘాలు కోరాయి. జనాన్ని జాగృతి చేసేందుకు, తెలంగాణ సమాజం కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, నిరంకుశ పాలన నిర్మూలన కోసం ఇన్నేండ్లు పని చేశామని తెలిపాయి.
ఇప్పుడు జర్నలిస్టు సమాజం కోసం ఆలోచించాల్సిన సమయం వచ్చిందని తెలిపింది. జర్నలిస్టుల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన సమయం ఆసన్నమైందని వెల్లడించింది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇప్పుడు జర్నలిస్టులు మరింత శ్రమించాలని పేర్కొంది. అభివృద్ధి ఫలాలు రేపటి తరానికి అందేలా చూద్దామని చెప్పింది.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అందరం కలిసి అభినందిద్దామని, మనమంతా ప్రభుత్వానికి తోడుగా వున్నామని మరో సారి నిరూపిద్దామని పిలుపునిచ్చింది. జర్నలిస్టుల ఐక్యతను చాటుదామని, జర్నలిస్టు సమూహం, సమాజం కోసం కూడా కొంత ప్రయత్నం చేద్దామని పేర్కొంది. వేలాదిగా జర్నలిస్టులు తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరింది.