విదేశాల నుంచి నడుస్తున్న క్రిప్టో ఎక్స్ఛేంజీ (Crypto Exchanges )లపై భారత ప్రభుత్వం ఉక్కు పాదం మోపింది. ఎట్టకేలకు వీటిపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. మనీలాండరింగ్ చట్టాలను పాటించకుండా ఈ క్రిప్టో ప్లాట్‌ఫారమ్‌లు భారతదేశంలో పనిచేస్తున్నాయని ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీని వల్ల భారత ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం సుమారు రూ.3000 కోట్ల నష్టం వాటిల్లుతోందని తెలిపింది.
బిట్‌కాయిన్‌లో ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETF) అమెరికాలో ఆమోదించబడింది. కానీ, భారత ప్రభుత్వం మాత్రం వ్యతిరేకతను తెలియచేస్తోంది. ప్రస్తుతం Binance, Kucoin, OKX వంటి క్రిప్టో ప్లాట్‌ఫారమ్‌ల వెబ్సైట్లు భారతదేశంలో నిషేధించబడ్డాయి. మరోవైపు క్రిప్టో పట్ల సెంట్రల్ బ్యాంక్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. క్రిప్టో కరెన్సీకి సంబంధించి ఎక్కడేం జరుగుతుందో అర్థం కావడంలేదని వెల్లడించారు.
ప్రజలు క్రిప్టోను అనుసరిస్తే ప్రమాదాలను ఎదుర్కోవలసి ఉంటుందని సూచించారు. క్రిప్టో మానియాను ప్రపంచం, అభివృద్ధి చెందుతోన్న మార్కెట్లు తట్టుకోలేవని అనుకోవడం లేదని శక్తికాంత దాస్ అన్నారు. కాగా ఈ క్రిప్టో ప్లాట్‌ఫారమ్‌లు ఇప్పటికే Apple యాప్ స్టోర్ నుండి తీసివేయబడ్డాయి. త్వరలో ఆండ్రాయిడ్ వెర్షన్లు కూడా పనిచేయడం మానేస్తాయంటున్నారు. ఇక 17వ శతాబ్దంలో డచ్ తులిప్‌ల ధరల్లో విపరీతమైన పెరుగుదల ఉంది. ప్రస్తుతం క్రిప్టో కరెన్సీ ఈ టెక్నాలజీపై పనిచేస్తుందని తెలుస్తోంది.
మరోవైపు భారతదేశంలో మా వెబ్సైట్, యాప్ పని చేయడం లేదని బినాన్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో తెలిపారు. అయితే, పెట్టుబడిదారులకు తమ డబ్బు సురక్షితంగా ఉందని కంపెనీ హామీ ఇచ్చింది. భారతదేశ చట్టాలను అనుసరించడానికి తాము కట్టుబడి ఉన్నామని బినాన్స్ చెప్పారు. అలాగే, పరిశ్రమ అభివృద్ధి కోసం రెగ్యులేటర్లతో నిరంతరం టచ్‌లో ఉన్నట్టు వివరించారు.