మండుతున్న ఎండకు అగ్నిప్రమాదాలు జతకట్టాయి.. అసలే భానుడి భగ భగలకు చిన్న నిప్పురవ్వ కూడా పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. కాగా తాజాగా బీహార్ (Bihar) రాష్ట్ర రాజధాని పాట్న (Patna)లో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. నేటి సాయంత్రం పాట్నా నగరంలో ఉన్న ఓ హోటల్‌లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.. దీంతో హోటల్‌లో ఉన్న ఆరుగురు వ్యక్తులు సజీవ దహనం అయ్యినట్లు సమాచారం..

అయితే ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలియరాలేదు.. కానీ మంటలు అదుపులోకి వచ్చిన అనంతరం కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలపై ఆరా తీస్తున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా పలు చోట్ల అగ్నిప్రమాదాలు జరగడం ఆందోళన కలిగిస్తుంది. కొన్ని చోట్ల ఆస్తి నష్టంతో పాటుగా ప్రాణ నష్టం సంభవించడం కనిపిస్తోంది. కారణం ఏదైనా ఈ ప్రమాదాల్లో సజీవదహనం అవడం బాధాకరం అంటున్నారు..