Telugu News » America : అగ్రరాజ్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్.. అంతా అబద్ధమని వెల్లడి..!

America : అగ్రరాజ్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్.. అంతా అబద్ధమని వెల్లడి..!

యుఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఇచ్చిన నివేదిక ఏకపక్షంగా ఉందని, దీనికి ఎలాంటి విలువ ఇవ్వడం లేదని రణధీర్ తెలిపారు. భారత్‌ (Bharath)పై ఏమాత్రం అవగాహన లేకుండా ఇలాంటివి ప్రచురించారని ధ్వజమెత్తారు..

by Venu
American Citizenship: Record of Indians in American Citizenship..!

గత ఏడాది భారత్‌లోని మణిపూర్‌ (Manipur)లో చేలరేగిన హింస అంశం మరోసారి తెరమీదికి వచ్చింది. తాజాగా ఈ విషయంపై అమెరికా (America) చేసిన పని ఆగ్రహానికి గురి చేసింది. మానవ హక్కుల ఉల్లంఘనలు చాలా జరిగాయని అగ్రరాజ్యం విడుదల చేసిన ఒక నివేదికపై తాజాగా భారత్ తీవ్రంగా స్పందించింది. నేడు విదేశాంగ మంత్రిత్వ శాఖ మీడియా సమావేశంలో పాల్గొన్న అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ (Randhir Jaiswal) మండిపడ్డారు..

యుఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఇచ్చిన నివేదిక ఏకపక్షంగా ఉందని, దీనికి ఎలాంటి విలువ ఇవ్వడం లేదని రణధీర్ తెలిపారు. భారత్‌ (Bharath)పై ఏమాత్రం అవగాహన లేకుండా ఇలాంటివి ప్రచురించారని ధ్వజమెత్తారు.. కాగా ఇటీవల విడుదలైన 2023 కంట్రీ రిపోర్ట్స్ ఆన్ హ్యూమన్ రైట్స్ ప్రాక్టీసెస్, ఇండియాలో మణిపూర్‌లో మెయిటీ, కుకీ తెగల మధ్య జరిగిన జాతి వివాదం “ముఖ్యమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు” దారితీసిందని అమెరికా ప్రస్తావించింది.

ఇక్కడ మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయని ఆరోపిస్తూ అందులో పలు అంశాలను పొందు పరిచింది. వాటిలో మనుషుల అదృశ్యాలు, చట్టవిరుద్ధమైన హత్యలు, ఏకపక్షంగా అరెస్టులు, బలవంతంగా నేరాన్ని ఒప్పుకోవడం కోసం హింసించడం, టెలికమ్యూనికేషన్లను నిరోధించడం, ఇంటర్నెట్ బంద్ చేయడం, పౌర సమాజ కార్యకర్తలు, జర్నలిస్టులపై నిఘా వంటి వాటికి పాల్పడిందని పేర్కొంది.

ఇదేకాకుండా మానవ హక్కుల పరిరక్షకుల బెదిరింపు, నేరాలకు కుటుంబ సభ్యులను శిక్షించడం, హింస లేదా బెదిరింపులతో కూడిన నేరాలు వంటి జరిగాయని నివేదికలో పొందుపరిచింది. దీంతో అవగాహన లేకుండా రిపోర్ట్‌‌ తయారు చేసిందని భారత్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది.

You may also like

Leave a Comment