ఉత్తర్ ప్రదేశ్(Uttar Pradesh)లోని బరేలీ(Bareilly)లో భోజిపురా హైవే(Bhojpur High Way)పై పెను ప్రమాదం సంభవించింది. శనివారం రాత్రి 11 గంటల సమయంలో ట్రక్కు, కారు ఢీకొన్నాయి. దీంతో రెండు వాహనాలు దగ్ధమయ్యాయి. ట్రక్కు డ్రైవర్ ప్రాణాపాయం నుంచి తప్పించుకోగా కారులో ఉన్న ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు. ఇందులో ఓ చిన్నారి కూడా ఉంది.
బరేలీ నుంచి బహెడి వైపు నైనిటాల్ హైవేపై ఎర్టిగా కారు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. హైవేపై భోజిపురా సమీపంలో వాహనం ఒక్కసారిగా అదుపు తప్పి డివైడర్ను దాటి అవతలి వైపు వెళ్లింది. మరోవైపు ముందు నుంచి అతివేగంతో వస్తున్న టక్కు.. కారును బలంగా ఢీకొట్టింది. దీంతో మంటలు రెండు వాహనాలకు మంటలంటుకున్నాయి.
దీంతో కారులో ప్రయాణిస్తున్న వారంతా ఎటూ వెళ్లలేని స్థితిలో సజీవ దహనమయ్యారు. వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ప్రాథమిక సమాచారం మేరకు ఈ ఘటనలో 8మంది మృతిచెందినట్లు పోలీసులు వెల్లడించారు.
రాంలీలా మొహల్లాలో నివాసముంటున్న సుమిత్ గుప్తా పెళ్లి వేడుక కోసం ఈ ఎర్టిగా కారును బుక్ చేశాడు. పెళ్లి వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన కారు బహేరీలోని రాంలీలా మొహల్లా నివాసి సుమిత్ గుప్తా పేరుపై బుకింగ్ ప్రాతిపదికన నడుస్తోంది. బుకింగ్ కోసం ప్రైవేట్ వాహనాన్ని ఉపయోగించడం చట్టవిరుద్ధమని, ఈ విషయంలో చర్యలు తీసుకోనున్నట్లు ఆర్టీవో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తెలిపారు.