తెలంగాణా(Telangana)లో ఇటీవల వరుస అగ్ని ప్రమాదాలు(Fire Accidents) ఆందోళన కలిగిస్తున్నాయి. రెండు నెలల వ్యవధిలోనే భారీ ప్రమాదాలు జరుగగా కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. అయితే, ఇప్పటి వరకు జరిగిన కొన్ని ప్రమాదాలకు కారణాలు అంతుచిక్కడం లేదు. అయితే, తాజాగా మరో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.
కలప మిల్లులో జరిగిన ఈ ప్రమాదం జరిగింది. దీంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా(Jagtial District) కోరుట్ల(Korutla)లోని సుఫియాన్ షా కలప మిల్లులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గుడిగురుజు దగ్గర గల మిల్లులో పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
క్షణాల్లోనే మిల్లు మొత్తం మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఫైరింజన్లతో మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. కానీ భారీగా ఆస్తినష్టం వాటిల్లిందని చెబుతున్నారు.
మిల్లులో ఉన్న కలప పూర్తిగా దగ్ధమైందన్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..