Telugu News » Alaska Airlines: ‘తప్పంతా మాదే.. మళ్లీ అలా జరగదు..’!

Alaska Airlines: ‘తప్పంతా మాదే.. మళ్లీ అలా జరగదు..’!

బోయింగ్‌ 737 మ్యాక్స్‌-9 విమానం 16వేల అడుగుల ఎత్తులో ఉన్న సమయంలో తలుపులు తెరుచుకోవడం కలకలం రేపింది. ఈ ఘటనపై విమానయాన సంస్థ తాజాగా స్పందించింది.

by Mano
Alaska Airlines: 'It's all our fault.. It won't happen again..'!

ఈ నెల 5వ తేదీన అలాస్కా ఎయిర్‌లైన్స్‌ (Alaska Airlines)కు చెందిన విమానం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. బోయింగ్‌ 737 మ్యాక్స్‌-9 విమానం 16వేల అడుగుల ఎత్తులో ఉన్న సమయంలో తలుపులు తెరుచుకోవడం కలకలం రేపింది. ఈ ఘటనపై విమానయాన సంస్థ తాజాగా స్పందించింది.

Alaska Airlines: 'It's all our fault.. It won't happen again..'!

ఈ ఘటనలో తప్పు తమదేనని అంగీకరించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని తెలిపింది. ఈ మేరకు సీఈవో (Boeing CEO) డేవ్‌ చల్హౌన్‌ (Dave Calhoun) ఉద్యోగులతో సమావేశమయ్యారు. తప్పును అంగీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

గత శనివారం పోర్ట్‌ల్యాండ్‌ నుంచి ఒంటారియోకు వెళ్లాల్సిన బోయింగ్‌ 737-9 మ్యాక్స్‌ విమానం (737 MAX 9 plane) టేకాఫ్‌ అయిన కొంతసేపటికి ఈ ఘటన చోటుచేసుకుంది. 16,325 అడుగుల ఎత్తులో దాని మధ్య క్యాబిన్‌ నిష్క్రమణ ద్వారం ఒక్కసారిగా ఊడిపోయింది. దీంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు.

ఈ మేరకు ఏర్పాటు చేసిన సమావేశంలో పూర్తిస్థాయి పారదర్శకత కోసం నియంత్రణ సంస్థలతో కలిసి పనిచేయనున్నట్లు సీఈవో వెల్లడించారు. మరోవైపు, ఈ ఘటనపై డీజీసీఏ విమానయాన సంస్థలకు బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాలను తనిఖీ చేయాలలని కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆయా విమానాల తనిఖీని విజయవంతంగా పూర్తయినట్లు తెలిపింది.

You may also like

Leave a Comment