హైదరాబాద్(Hyderabad)లో భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) సంభవించింది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు చెబుతున్నారు. మైలార్‌దేవ్‌పల్లి(Mailardevpally) పరిధి స్థానిక టాటానగర్(Tata Nagar) లోని ఓ ప్లాస్టిక్ గోడౌన్‌లో రాత్రివేళ ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. దీంతో జనం భయంతో పరుగులు తీశారు.
ప్లాస్టిక్ వస్తువులు కావడంతో మంటలు త్వరగా వ్యాపించాయి. చుట్టూ కొద్ది కిలోమీటర్ల వరకు దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో చుట్టుపక్కల ఉన్న జనాలు ఊపిరాడక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అప్పటికే మంటలు దావణంగా వ్యాపించాయి.
మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బందికి నాలుగు గంటల సమయం పట్టింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఆస్తి నష్టం మాత్రం భారీగా ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి రావడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదం గురించి పోలీసులకు సమాచారం అందగానే అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.
ఈ ప్రమాదం ఎలా జరిగింది? షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలంటుకున్నాయా? లేక ఎవరైనా కావాలనే కుట్ర పన్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రమాద సమయంలో గోడౌన్‌లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది.