Telugu News » Fire Accident in Nallamala: నల్లమలలో కార్చిచ్చు.. మంత్రి కీలక ఆదేశాలు..!

Fire Accident in Nallamala: నల్లమలలో కార్చిచ్చు.. మంత్రి కీలక ఆదేశాలు..!

నల్లమల అడవి(Nallamala Forest)లో భారీ అగ్నిప్రమాదం(Fire Accident) సంభవించింది. సుమారు 50 హెక్టార్ల విస్తీర్ణంలో అటవి దగ్ధమైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ అగ్నిప్రమాదంపై అటవీశాఖ మంత్రి కొండా సురేఖ స్పందించారు.

by Mano
Fire Accident in Nallamala: Fire in Nallamala.. Minister's key orders..!

నాగర్‌ కర్నూలు జిల్లా(Nagar Kurnool District)లోని నల్లమల అడవి(Nallamala Forest)లో భారీ అగ్నిప్రమాదం(Fire Accident) సంభవించింది. అమ్రాబాద్ మండలం దోమలపెంట రేంజ్ పరిధిలో మంటలు చెలరేగాయి. కొల్లంపెంట, కొమ్మనపెంట, పల్లెబైలు, నక్కర్లపెంటకు ఈ మంటలు వ్యాపించాయి.

Fire Accident in Nallamala: Fire in Nallamala.. Minister's key orders..!

దీంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బందికి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 50 హెక్టార్ల విస్తీర్ణంలో అటవి దగ్ధమైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ అగ్నిప్రమాదంపై అటవీశాఖ మంత్రి కొండా సురేఖ స్పందించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఈ నేపథ్యంలో మంత్రి వారికి కీలక సూచనలు చేశారు.

అడవుల్లో కార్చిచ్చు వ్యాపించకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి కొండా సురేఖ అధికారులకు సూచించారు. అదేవిధంగా అడవిలోని జంతువులకు ఎలాంటి హాని కలగకుండా చూడాలన్నారు. దీంతో అధికారులు ఆదిశగా చర్యలు ముమ్మరం చేశారు.

You may also like

Leave a Comment