గణేష్ (Ganesh) నవరాత్రులను దేశ వ్యాప్తంగా భక్తులు (Devotees) ఘనంగా జరుపుకుంటున్నారు. చిన్నా, పెద్ద తేడా లేకుండా అంతా గణేష్ విగ్రహాలను ప్రతిష్టించి భక్తి శ్రద్దలతో కొలుస్తున్నారు. ఈ తొమ్మిది రోజుల పాటు గణపతికి విభిన్న రకాల నైవేద్యాలను సమర్పిస్తున్నారు. వినాయక మండపాల్లో భజనలతో చేస్తూ భక్తి పారవశ్యంలో మునిగి పోతున్నారు.
ఇక నిర్వాహకులు గణపతి విగ్రహాల ద్వారా అద్బుతమై సందేశాలను ఇస్తున్నారు. ఇటీవల చంద్రయాన్ -3 గురించి ప్రజలు, విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు చంద్రయాన్ గణపతిని ఏర్పాటు చేశారు. ఆ విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది. అలాగే పర్యావరణ పరిరక్షణ, పచ్చదనాన్ని పెంపొందించేందుకు నాగోల్ కు చెందిన భక్తులు వినూత్న రీతిలో జరుపుకుంటున్నారు.
దేశంలోనే మొదటి సారిగా నాగోల్లో మొక్కలతో రూపొందించిన గ్రీణ్ గణేష్ విగ్రహాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం 20 అడుగుల ఎత్తులో వుంది. ఈ విగ్రహం తయారీకి 5000 వేల మొక్కలతో తయార చేశారు. తొమ్మిది రోజుల పాటు గ్రీన్ గణేశునికి భక్తులు పూజలు చేస్తున్నారు. గ్రీన్ గణేష్ నీ దర్శించుకుంటున్న ప్రతి భక్తుడికీ ప్రసాదం కింద ఓ మొక్కను నిర్వాహకులు ఇస్తున్నారు.
నిమజ్జనం రోజు గణపతిలోని విగ్రహాలను భక్తులకు అందజేయనున్నారు. దేశంలోని ప్రతి ఒక్కరిలో మొక్కలు పెంచాలనే ఆలోచన తీసుకురావాలని నిర్వహకులు భావిస్తున్నారు. ఆ పచ్చదనంతో ఆరోగ్యమైన గాలి పీల్చుకుని ప్రజలు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండేలా ఆ వినాయకుడు తన ఆశీస్సులను ప్రజలకు అందజేయాలని కోరుకుంటున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు.