Telugu News » Flights cancelled: ఒకేసారి160 విమానాలు రద్దు, ఎందుకంటే…

Flights cancelled: ఒకేసారి160 విమానాలు రద్దు, ఎందుకంటే…

రద్దు అవుతాయని చెప్తున్న 160 విమానాలతో పాటు మరికొన్ని విమానాలు కూడా రద్దయ్యే అవకాశం ఉందని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. ఇది కేవలం అంచనా మాత్రమేనని తెలిపారు.

by Prasanna

జీ-20 సమ్మిట్ (G20 Summit) కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో (Delhi Airport) దాదాపు 160 విమానాలు రద్దు కానున్నాయి. ఢీల్లీ నుంచి బయలుదేరేవి 80, ఢీల్లీకి వచ్చేవి మరో 80 విమానాలు రద్దు చేస్తున్నారు. జీ-20 సదస్సులో భాగంగా విధించిన నిబంధనలతో ఈ సమస్య తలెత్తిందని ఢీల్లీ ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు.

Delhi airport

ఇది అంచనా మాత్రమే…            

రద్దు అవుతాయని చెప్తున్న 160 విమానాలతో పాటు మరికొన్ని విమానాలు కూడా రద్దయ్యే అవకాశం ఉందని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. ఇది కేవలం అంచనా మాత్రమేనని తెలిపారు. రద్దవుతున్న విమానాలన్ని దేశీయ విమానాలేనని చెప్పారు. అయితే అంతర్జాతీయ సర్వీసులకు ఎటువంబి ఇబ్బంది ఉండదని, జీ-20 సదస్సు కారణంగా  ప్రయాణీకులకు తక్కువ ఇబ్బందులు ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఇందు కోసం అన్ని విమానాయన సంస్థల ప్రతినిధులతో కలిసి పని చేస్తున్నట్లు చెప్పారు.

delhi airport 2

ప్రయాణీకుల కోసం…

దేశీయంగా రాకపోకలు సాగించే విమానయాన సంస్థలు ప్రయాణీకులకు ఎదురవుతున్న ఇబ్బందులను తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నాయి. కొన్ని విమానాయన సంస్థలు రీషెడ్యూల్ అయిన విమాన సర్వీసుల్ని వినియోగదారులు ఒకసారి మార్చుకునేందుకు వీలుగా అదనపు ఛార్జీలను తొలగించాయి. అలా చేసిన సంస్థల్లో విస్తానా, ఎయిర్ ఇండియా ఉన్నాయి.

delhi airport 3

త్వరగా చేరుకోవాలి…

సెప్టెంబర్ 8-11 మధ్యలో విమాన ప్రయాణాల సమయంలో సర్వీసులు, స్టేటస్లను జాగ్రత్తగా చెక్ చేసుకోవాలని వివిధ విమానయాన సంస్థల్లో టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులకు అయా సంస్థలు విజ్ఞప్తి చేశాయి. మరోవైపు జీ-20 కారణంగా ఉన్న ట్రాఫిక్ నిబంధనలను దృష్టిలో పెట్టుకొని ప్రయాణికులు తొందరగా బయల్దేరి విమానాశ్రయానికి చేరుకోవాలని విమానయన సంస్థలు తమ వినియోగదారులకు సూచించాయి.

వీవీఐపీలు ల్యాండ్ అయ్యేది అక్కడే…

జీ-20 సదస్సుకు హాజరయ్యే ప్రపంచ దేశాల అధినేతల కోసం దిల్లీ ఎయిర్ పోర్టులో ఏర్పాట్లను పూర్తయ్యాయి. అమెరికా, ఫ్రాన్స్ అధ్యక్షులు, బ్రిటన్, కెనడా ప్రధానులు సహా మొత్తం 70 మంది వీవీఐపీ విమానాలు పాలం టెక్నికల్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ కానున్నాయి. అత్యవసర పరిస్థితులు కోసం లఖ్ నవూ, జైపుర్, ఇండోర్, అమృత్సర్ లోని నాలుగు రిజర్వు ఎయిర్ పోర్టులను కూడా సిద్ధంగా ఉంచారు.

దేశాధినేతలకు ఆహ్వానం పలికేందుకు ఢిల్లీ ఎయిర్ పోర్టులో మూడు లాంజ్ లను సిద్ధం చేశారు. వీటిల్లో వారు తమ నిబంధనలు పూర్తి చేసుకొని వేగంగా వెళ్లిపోవచ్చు. సాధారణ ప్రయాణికులకు ఇబ్బంది. రాకుండా ఈ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

 

You may also like

Leave a Comment