Telugu News » Flipkart : షాకిచ్చిన ఆన్‌లైన్‌ షాపింగ్.. టీవీ ఆర్డర్‌ చేస్తే ఏం వచ్చిందంటే..?

Flipkart : షాకిచ్చిన ఆన్‌లైన్‌ షాపింగ్.. టీవీ ఆర్డర్‌ చేస్తే ఏం వచ్చిందంటే..?

ఈ ఆన్‌లైన్‌ షాపింగ్ (Online Shopping)వల్ల లాభంతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. అయిన కానీ చాలా మంది ఆన్‌లైన్‌ షాపింగ్‌కే మొగ్గు చూపుతున్నారు.

by Venu

నేటి కాలంలో మనుషులకు క్షణం తీరిక లేదు. ఏదైనా వస్తువులు, ఫుడ్, మెడిసిన్ మొదలగునవి కావాలనుకొంటే ఆన్‌లైన్‌ లో ఆర్డర్ చేయడమే.. మరి ఇది ఎంత వరకు సేఫ్టీ అంటే.. సమాధానం మాత్రం దొరకదు. అయితే ఈ ఆన్‌లైన్‌ షాపింగ్ (Online Shopping)వల్ల లాభంతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. అయిన కానీ చాలా మంది ఆన్‌లైన్‌ షాపింగ్‌కే మొగ్గు చూపుతున్నారు.

తమకు కావల్సిన వస్తువులను ఈ కామర్స్‌ ప్లాట్‌ ఫామ్స్ ద్వారా ఆర్డర్‌ చేసుకుంటున్నారు. ఇబ్బందులు వస్తే కొందరు నష్టపోతున్నారు.. మరికొందరు ముక్కు పిండి డబ్బులు వసూలు చేసుకొంటున్నారు. కానీ ఇప్పుడు చెప్పబోయే మ్యాటర్ లో మాత్రం కస్టమర్ తన బాధను సోషల్ మీడియాలో షేర్ చేసుకొని, కంపెనీ పై కామెంట్ మాత్రమే పెట్టారు. ఆ వివరాలు చూస్తే..

ఆర్యన్‌ అనే వ్యక్తి రూ.లక్ష విలువైన టీవీని ఆర్డర్‌ చేస్తే బదులుగా మరో టీవీ డెలివరీ అయ్యింది. దసరా, నవరాత్రి సందర్భంగా ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) బిగ్‌ బిలియన్‌ డేస్‌ (Big Billion Days Sale) పేరుతో సేల్‌ నిర్వహించింది. ఈ సేల్‌లో భాగంగా ఆర్యన్‌ అనే వ్యక్తి రూ.లక్ష విలువైన సోనీ టీవీ (Sony TV)ని కొనుగోలు చేశాడు. ఆర్డర్‌ కూడా డెలివరీ అయ్యింది. టీవీని ఇన్‌స్టాల్‌ చేసేందుకు టెక్నీషియన్‌ తో కలిసి ఆ పార్శిల్‌ ఓపెన్ చేశారు. అంతే ఆ వస్తువును చూసి ఇద్దరూ తెల్ల ముఖాలేసుకొన్నారు.

ఆ బాక్స్‌లో సోనీ టీవీ లేదు. బదులుగా థామ్సన్‌ టీవీ (Thomson TV) పంపించారు కంపెనీ వాళ్ళు.. వెంటనే కస్టమర్‌ కేర్‌కు కాల్‌ చేసి విషయాన్ని తెలుపగా.. వారు టీవీని ఫొటో తీసి అప్‌లోడ్‌ చేయమని చెప్పారు. వారు చెప్పినట్టే ఆర్యన్‌ చేశాడు. అయినా అటువైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇలా రోజులు గడిచిపోతున్నాయి. ఇక విసుగొచ్చిన ఆర్యన్‌ తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసుకున్నాడు.. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. కాగా ఈ పోస్ట్‌ పై స్పందించిన ఫ్లిప్‌కార్ట్‌ జరిగిన పొరపాటుకు ఆర్యన్‌కి క్షమాపణలు చెప్పింది. తన సమస్యకు వీలైనంత త్వరగా పరిష్కారం చూపిస్తా అని హామీ ఇచ్చింది..

You may also like

Leave a Comment