అమెరికా (America), ఫ్లోరిడా (Florida)లో విమానం కూలిన ( plane crash) ఘటనలో పైలట్‌తో సహా ముగ్గురు మరణించారు.. స్థానిక మీడియా కథనాల ప్రకారం ఈ విమానం మొబైల్ ఇంటిని ఢీకొనడంతో ప్రమాదానికి గురైందని సమాచారం.. విమాన ప్రమాదంలో పైలట్‌తోపాటు ఇంట్లో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు మరణించినట్లుగా తెలుస్తోంది.
ఫ్లోరిడాలోని టేలర్ పార్క్‌లో కూలిన విమానం సింగిల్ ఇంజిన్ బీచ్‌క్రాఫ్ట్ బొనాంజా వీ35 అని అధికారులు వెల్లడించారు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ప్రమాదం గురించి సమాచారం ఇస్తూ, విమానం కూలిపోయే కొద్దిసేపటికి ముందు పైలట్ ఇంజిన్ వైఫల్యం గురించి పేర్కొన్నట్లు తెలుస్తోంది. మరోవైపు సెయింట్ పీట్-క్లియర్‌వాటర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో రన్‌వేకి ఉత్తరంగా మూడు మైళ్ల దూరంలో రాడార్ నుంచి విమానం అదృశ్యమైందని తెలిపారు..
అయితే దీనికంటే ముందు పైలట్ అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తెలిపింది. విమాన ప్రమాదానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రమాదం జరిగిన తర్వాత విమానం ఎలా కాలిపోతుందో ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. కాగా పైలట్ అదృశ్యమయ్యే ముందు మే డేని ప్రకటించడం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విన్నదని అన్నారు.
మరోవైపు ఎయిర్‌క్రాఫ్ట్ ఫైర్ బ్రిగేడ్ అధికారులు విమానంలో మంటలు చెలరేగినట్లు సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకొన్నామని అధికారులు తెలిపారు. ఎలాగోలా మంటలను అదుపు చేసినట్లు వెల్లడించారు.