Telugu News » Food Poison: వంద మంది విద్యార్థినులకు అస్వస్థత

Food Poison: వంద మంది విద్యార్థినులకు అస్వస్థత

ఇలా  ఒక్కొక్కరుగా 100 మంది అస్వస్థతకు  గురి కావడంతో పాఠశాలలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.

by Prasanna
food poison

నిజామాబాద్ జిల్లా (Nizamabad Dist) లో భీంగల్ కస్తూర్బా పాఠశాలలో 100 విద్యార్థినులు అస్వస్థతకు గురైయ్యారు. నిన్న రాత్రి ఆహారం (Food) తీసుకున్న కొద్ది సేపటికే విద్యార్థినులు (Students) ఒకరి తర్వాత ఒకరు అస్వస్థతకు  లోనయ్యారు.

food poison

ఆహారం తిన్న తర్వాత విద్యార్థినులు కడుపు నొప్పితో  బాధపడ్డారు. ఆ తర్వాత తిన్న ఆహారాన్ని అంతా  వాంతులు చేసుకున్నారు. ఇలా  ఒక్కొక్కరుగా 100 మంది అస్వస్థతకు  గురి కావడంతో పాఠశాలలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.

వెంటనే అక్కడున్న వార్డెన్ అధికారులకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పారు. వారి ఆదేశాల మేరకు అస్వస్థతకు గురైన విద్యార్థినులందరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించారు. అస్వస్థతకు గురైన వారిలో కొందరు సృహ తప్పిపోయారు. అస్వస్థతకు గురైన వారిల 80 మందిని నిజామాబాద్ ఆసుపత్రికి, మిగతా వారిని భీంగల్ ఆసుపత్రికి తరలించారు.

 ఆసుపత్రుల్లో చేరిన విద్యార్థినులందరికి తక్షణ చికిత్సను ప్రారంభించిన వైద్యులు, అందరి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. మరో వైపు పాఠశాలకు చేరుకున్న అధికారులు అక్కడ విద్యార్థినులు తిన్న ఆహారం శాంపిల్స్ తీసుకుని వాటిని పరీక్ష కోసం ల్యాబ్ కు పంపించారు. ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కారణాలను విశ్లేషించి ఫుడ్ పాయిజన్ అంశంపై విచారణ జరుపుతామని అధికారులు చెప్పారు.

 ఇది ఇలా ఉండగా…గత రెండేళ్లుగా తెలంగాణాలోని  పలు కస్తూర్బా పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థినులు అస్వస్థతకు గురైన సంఘటనలు చాలా చోట్ల చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది మార్చిలో మహబుబా బాద్ కస్తూర్బా పాఠశాలలో 30 మంది, గతేడాది జూలైలో బీర్కూర్ మండలంలోని కస్తూర్బా పాఠశాలలో 10 మంది, అలాగే ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని కస్తూర్బా పాఠశాలలో 22 మంది అస్వస్థలకు గురైన సంఘటనలు చోటు చేసుకున్నాయి.

ఇలా కస్తూర్బా పాఠశాలలో తరుచూ ఫుడ్ పాయిజన్ కావడం, అన్నంలో పురుగులు వస్తుండటం వంటి సంఘటనలు  జరుగుతుండటంపై విద్యార్థినుల తల్లిదండ్రులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సరైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

You may also like

Leave a Comment