Telugu News » Kishan Reddy : విమోచన దినోత్సవం మెదటి ద్రోహి కాంగ్రెస్.. రెండో ద్రోహి బీఆర్ఎస్!

Kishan Reddy : విమోచన దినోత్సవం మెదటి ద్రోహి కాంగ్రెస్.. రెండో ద్రోహి బీఆర్ఎస్!

తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ముఖ్యమంత్రులను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నామని తెలిపారు కిషన్ రెడ్డి. ఒవైసీ అనుమతి ఉంటేనే సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 17 కార్యక్రమానికి హాజరవుతారని అన్నారు.

by admin
Telangana BJP President Kishan Reddy Press Meet

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈనెల 17న పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ (Telangana) విమోచన ఉత్సవాలు ఘనంగా జరుగుతాయన్నారు బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy). ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) వస్తున్నారని తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడిన కిషన్ రెడ్డి.. మూర్ఖత్వంతో తమకు పరేడ్ గ్రౌండ్స్ ఇవ్వలేదని కొందరు ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ (Congress) నేతలపై మండిపడ్డారు. విమోచన ఉత్సవాలు బీజేపీ కార్యక్రమం కాదని గుర్తుంచుకోవాలన్నారు.

Telangana BJP President Kishan Reddy Press Meet

తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ముఖ్యమంత్రులను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నామని తెలిపారు కిషన్ రెడ్డి. ఒవైసీ అనుమతి ఉంటేనే సీఎం కేసీఆర్ (KCR) సెప్టెంబర్ 17 కార్యక్రమానికి హాజరవుతారని అన్నారు. రాష్ట్రపతి నిలయంలో కూడా తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహిస్తున్నామని వివరించారు. మజ్లిస్ పార్టీకి లొంగిపోయి‌ ఇచ్చిన వాగ్దానాన్ని కేసీఆర్ విస్మరించారని ఆరోపించారు. సెప్టెంబర్ 17న సమైక్యత దినోత్సవం కాదు.. విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.

గతంలో కాంగ్రెస్, ఇప్పుడు బీఆర్ఎస్ ఎంఐఎంకు లొంగిపోయాయని విమర్శించారు కిషన్ రెడ్డి. విమోచన దినోత్సవాన్ని నిర్వహించేది లేదని కాంగ్రెస్ ముఖ్యమంత్రులు గతంలో అసెంబ్లీలో అన్నారని గుర్తు చేశారు. తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని.. ఒకప్పుడు మాజీ సీఎం రోశయ్య పంచ ఊడదీయాలని పిలిపునిచ్చిన కేసీఆర్.. ఇప్పుడెందుకు విమోచన దినోత్సవాన్ని నిర్వహించటం‌ లేదని ప్రశ్నించారు. విమోచన దినోత్సవంలో మెదటి ద్రోహి కాంగ్రెస్.. రెండో ద్రోహి బీఆర్ఎస్ అని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చరిత్రను తొక్కిపెట్టిందని.. కర్ణాటక, మహారాష్ట్రలో హైదరాబాద్ ముక్తి దివస్ ను నిర్వహించి ఇక్కడ ఎందుకు నిర్వహించలేదని అడిగారు. నిజాం హయాంలో తెలంగాణ అస్తిత్వం, భాషా, సంప్రదాయం వివక్షకు గురయ్యాయని.. సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవం కోసం బీజేపీ 1998 నుంచి పోరాటం చేస్తోందని వివరించారు. విమోచన ఉత్సవాలు నిర్వహించాల్సిందిగా.. తెలంగాణలోని అందరు సర్పంచ్ లకు లేఖలు రాస్తున్నానని అన్నారు కిషన్ రెడ్డి.

You may also like

Leave a Comment