Telugu News » KCR : కోలుకుంటున్న మాజీ సీఎం కేసీఆర్….!

KCR : కోలుకుంటున్న మాజీ సీఎం కేసీఆర్….!

ప్రస్తుతం ఆయన జూబ్లిహిల్స్ నందినగర్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు వైద్యులు పర్య వేక్షిస్తున్నారు.

by Ramu
former cm kcr is currently running with the help of walker

మాజీ సీఎం కేసీఆర్ (KCR) గాయాల నుంచి నెమ్మదిగా కోలుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే మెల్లగా వాకర్ (Walker) సహాయంతో నడుస్తున్నారు. ప్రస్తుతం ఆయన జూబ్లిహిల్స్ నందినగర్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు వైద్యులు పర్య వేక్షిస్తున్నారు.

former cm kcr is currently running with the help of walker

సీఎం కేసీఆర్ నెమ్మదిగా కోలుకుంటున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని పార్టీ నాయకులు కోరుకుంటున్నారని తెలిపారు. తిరిగి రాజకీయాల్లో కేసీఆర్ యాక్టివ్ కావాలని, పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయాలని నాయకులు, కార్యకర్తలు అనుకుంటున్నారని చెప్పారు.

ఇటీవల తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముందు సీఎం కేసీఆర్ తన ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో కాలు జారి కింద పడ్డారు. దీంతో ఆయన కాలుకు తీవ్ర గాయం అయింది. ఎడమకాలు తుంటి ఎముకకు తీవ్ర గాయం కావడంతో ఆయన్ని కుటుంబ సభ్యులు సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు.

కొద్ది రోజుల పాటు కేసీఆర్ యశోద ఆస్పత్రిలోనే చికిత్స పొందారు. తుంటి ఎముకకు వైద్యులు సర్జరీ నిర్వహించారు. అనంతరం ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. కొంత కాలం విశ్రాంతి తీసుకోవాలని కేసీఆర్ కు వైద్యులు సూచించారు. 8 వారాలు విశ్రాంతి తీసుకుంటే కేసీఆర్ కోలుకుంటారని సూచనలు చేశారు.

You may also like

Leave a Comment