రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress).. బీఆర్ఎస్ (BRS) నేతల మధ్య మాటల వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా నేతలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకొంటున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ (Rasamayi Balakishan).. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మానకొండుర్ నియోజకవర్గ స్థాయిలో తిమ్మపూర్ మండలం కొత్తపల్లిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్లో హాల్లో గులాబీ నేతలు సమావేశం నిర్వహించారు..
బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశానికి.. మాజీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్, రసమయి బాలకిషన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రసమయి.. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యానారాయణ (Kavvampally Satyanarayana)పై మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో దొంగ మాటలు చెప్పి కవ్వంపల్లి గెలిచాడని ఆరోపణలు చేశారు..
తాను ఎమ్మెల్యేగా ఉన్న పది సంవత్సరాలు ఏ రోజూ కూడా కవ్వంపల్లి మర్యాద ఇవ్వలేదని రసమయి ఆరోపించారు. వాడు వీడు అంటూ ప్రతిరోజూ తనని అసభ్య పదజాలంతో దూషణలకు దిగాడని వెల్లడించారు. ఇకనైనా ఎమ్మెల్యే తన తీరు, భాష మార్చుకోకపోతే తాను కూడా ఆ దారిలోకి వెళతానని, రసమయి బాలకిషన్ హెచ్చరించారు.. ఇప్పుడు ఆయన ఒక ఎమ్మెల్యే.. గౌరవ స్థానంలో ఉన్న ఆయన పద్దతి మార్చుకోక పోతే.. విలువ ఉండదని రసమయి సూచించారు..