Telugu News » Congress Ex Mp: చంద్రబాబు అరెస్ట్‌ దారుణం!

Congress Ex Mp: చంద్రబాబు అరెస్ట్‌ దారుణం!

చంద్రబాబు నాయుడు ను అరెస్టు చేయడం వెనుక ఢిల్లీ పెద్దల హస్తం ఉంది

by Sai
delhi heads are behind chandrababu says chintha mohan

చింతా మోహన్‌,
కాంగ్రెస్‌ మాజీ ఎంపీ

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌(Skill development scam) అనేది ఒక స్కామే కాదని, దీన్ని బూచిగా చూపి టీడీపీ(TDP) అధినేత నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)ను అరెస్టు చేయడం వెనుక ఢిల్లీ పెద్దల హస్తం ఉంది. చంద్రబాబు అరెస్టు తర్వాత సీఎం జగన్ పట్టరాని సంతోషంలో ఉన్నారు. అయితే, చంద్రబాబుకు సుప్రీంకోర్టులోనే న్యాయం జరుగుతుంది.

delhi heads are behind chandrababu says chintha mohan

ఆయన అప్పటి వరకు జైల్లో ఉండక తప్పదు. చంద్రబాబు ఖచ్చితంగా తప్పుచేసివుండరని, స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ అసలు స్కామే కాదు. ఇలాంటి అక్రమ అరెస్టులు చేస్తే ముఖ్యమంత్రిగా ఎవరూ పని చేయరు. చంద్రబాబును జైలుకు పంపించడం దారుణం

ఏసీబీ కోర్టు తీర్పు సరిగా లేదు. ఈ మధ్యకాలంలో జడ్జిమెంట్లు సరిగా ఉండటం లేదు. చంద్రబాబుకు రిమాండ్ విధించిన తీర్పులో లోటుపాట్లు ఉన్నాయి. సుప్రీంకోర్టులో చంద్రబాబుకు న్యాయం జరుగుతుంది.

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో సుప్రీంకోర్టులోనే న్యాయం జరుగుతుంది. ఈ కేసు కోర్టులో నిలవదు. రాజమండ్రి సెంట్రల్ జైలులో వసతులు సరిగా లేవని, లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత జగన్ నవ్వుతూ ఇంటికి వెళ్లారు.

You may also like

Leave a Comment