Telugu News » Ayodhya: అయోధ్య రామమందిర స్థలంలో బయటపడ్డ పురాతన విగ్రహాలు

Ayodhya: అయోధ్య రామమందిర స్థలంలో బయటపడ్డ పురాతన విగ్రహాలు

ఈ ఫోటోలో అనేక విగ్రహాలు, పురాతన ఆలయ స్తంభాలు ఉన్నాయి. మందిర నిర్మాణ ప్రదేశంలో వీటిని తాత్కాలికంగా ఓ షెడ్‌లో భద్రపరిచారు.

by Prasanna
Ayodya

అయోధ్య (Ayodhya) లోని రామ మందిర స్థలం (Rama Mandir) లో పురాతన ఆలయ అవశేషాలు బయటపడ్డయని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ (Champath Roy) వెల్లడించారు. తవ్వకాల్లో బయటపడిన విగ్రహాలు, పురాతన నిర్మాణ అవశేషాల ఫోటోను కూడా ట్వీట్టర్ (ఎక్స్)లో షేర్ చేశారు. ఈ ఫోటోలో అనేక విగ్రహాలు, పురాతన ఆలయ స్తంభాలు ఉన్నాయి. మందిర నిర్మాణ ప్రదేశంలో వీటిని తాత్కాలికంగా ఓ షెడ్‌లో భద్రపరిచారు.

Ayodya
ఇలాగే మూడేళ్ల కిందట అయోధ్యలో రామజన్మభూమి స్థలానికి సమీపంలో శివలింగం, దేవతామూర్తుల విగ్రహాలు, శిల్పాలు చెక్కి ఉన్న స్తంభాలు బయటపడ్డాయి. నిర్మాణ పనులు మొదలు పెట్టినప్పుడు అక్కడ వ్యర్థాలను తొలగించి, భూమిని చదును చేస్తుండగా శివలింగ సహా దేవతమూర్తుల విగ్రహాలు బయటపడినట్టు శ్రీరామ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర టస్ట్ తెలిపింది.

రామమందిర ప్రారంభోత్సవం జనవరి మూడో వారంలో ఉండే అవకాశం ఉందని
శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు చెప్తున్నారు. వచ్చే ఏడాది జనవరి మూడో వారంలో జరిగే రామమందిర ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారని తెలిపారు. అయితే, తుది షెడ్యూల్ విషయంలో మాత్రం ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ఆమోదం రావాల్సి ఉంటుంది.

దాదాపు 135 ఏళ్ల పాటు కొనసాగిన అయోధ్య రామమందిరం-బాబ్రీ మసీదు వివాదానికి 2019 నవంబరులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో తెరపడింది. వివాదాస్పద స్థలాన్ని హిందువులకు అప్పగించిన కోర్టు.. మసీదు నిర్మాణం కోసం సున్నీ వక్ఫ్‌ బోర్డుకు వేరే ప్రదేశంలో ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని ఆదేశించింది. కోర్టు తీర్పుతో రామమందిర నిర్మాణ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి.

You may also like

Leave a Comment