Telugu News » Gaganyaan: జయహో భారత్.. గగన్‌యాన్ తొలి ప్రయోగం విజయవంతం!

Gaganyaan: జయహో భారత్.. గగన్‌యాన్ తొలి ప్రయోగం విజయవంతం!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) చేపట్టిన గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన గగన్‌యాన్(Gaganyan) తొలి దశ ప్రయోగం TV-D1 విజయవంతమైంది. రోదసీలోకి వ్యోమగాములను పంపేందుకు భారత్ ఈ ప్రయోగాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.

by Mano
Gaganyaan: Jaiho Bharat.. Gaganyaan's first experiment is successful!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) చేపట్టిన గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన గగన్‌యాన్(Gaganyan) తొలి దశ ప్రయోగం TV-D1 విజయవంతమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి శనివారం ఉదయం 10 గంటలకు సింగిల్ స్టేజ్ లిక్విడ్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. రోదసీలోకి వ్యోమగాములను పంపేందుకు భారత్ ఈ ప్రయోగాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.

Gaganyaan: Jaiho Bharat.. Gaganyaan's first experiment is successful!

దీంతో గగన్‌యాన్ సాకార దిశగా తొలి అడుగు పడింది. ఈ ప్రాజెక్టులో భాగంగా తలపెట్టిన కీలక ‘టెస్ట్ వెహికిల్ అబార్ట్ మిషన్ (TV-D1)’ వాహకనౌక పరీక్షను ఇస్రో శనివారం విజయవంతంగా పరీక్షించింది. ఆ తర్వాత రాకెట్ నుంచి విడిపోయిన క్రూ మాడ్యూల్ సురక్షితంగా పారాచూట్ల సాయంతో సముద్రంలోకి దిగింది. రాకెట్ నింగిలోకి బయల్దేరాక, అనూహ్య పరిస్థితుల్లో ప్రయోగాన్ని రద్దు చేసుకోవాల్సిన పరిస్థితుల్లో ఇస్రో శాస్త్రవేత్తలు కొద్ది నిమిషాల్లోనే సరిచేసి అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేశారు.

ఇందుకోసం ‘అబార్ట్’ సంకేతాన్ని పంపారు. దాదాపు 17 కిలోమీటర్ల ఎత్తులో క్రూ ఎస్కేప్ వ్యవస్థను రాకెట్‌ నుంచి వేరు చేశాయి. ఈ ప్రయోగం విజయవంతమైనందుకు సంతోషంగా ఉందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. బంగాళాఖాతంలోకి దిగిన క్రూ మాడ్యూల్‌ను రికవరీ చేశామని చెప్పారు. దాన్ని అధ్యయనం చేస్తామన్నారు.

మొదట్లో వాతావరణం ప్రతికూల పరిస్థితులు ఏర్పడడంతో ప్రయోగాన్ని వాయిదా వేశామన్నారు. సాంకేతిక సమస్యను గుర్తించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నామన్నారు. సత్వరమే దాన్ని సరిచేసి రాకెట్ స్థితిని పరిశీలించి మళ్లీ ప్రయోగించినట్లు తెలిపారు. ‘ఏదైనా సమస్య ఎదురైతే ఎలా సరిదిద్దాలనే విషయాన్ని తమ బృందం నిరూపించింది’ అని ఇస్రో చైర్మన్ సోమనాథ్ వ్యాఖ్యానించారు.

 

You may also like

Leave a Comment