Telugu News » Hyderabad: హైదరాబాద్ కి 3.5 లక్షల గణేషులు వస్తున్నారు ! 

Hyderabad: హైదరాబాద్ కి 3.5 లక్షల గణేషులు వస్తున్నారు ! 

ఎక్కడ చూసినా సందడి వాతావణమే కనిపిస్తుంది. మరో రెండు రోజుల్లో వినాయకచవితి (Vinayaka Chavithi) వస్తుండటంతో మండపాల ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి.

by Prasanna
vinayakudu

గ్రేటర్ హైదరాబాద్ (Greater Hyderabad) పరిధిలో గతేడాది కంటే ఈ ఏడాది ఎక్కువ గణనాధుని విగ్రహాల ప్రతిష్ట జరుగుతుందని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ (Bhagyanagar Ganesh Utsava Committee) తెలిపింది. ఇప్పటికే గణేషుని మండపాలు అన్ని వీధుల్లో ముస్తాబవుతూ కనిపిస్తున్నాయి. స్థానిక కమిటీలు, యువకులు ప్రతి కూడలి, సందు, స్ట్రీట్ అని తేడా లేకుండా అన్ని చోట్ల గణనాధుని మండపాలు  వేస్తున్నారు. ఎక్కడ చూసినా సందడి వాతావణమే కనిపిస్తుంది. మరో రెండు రోజుల్లో వినాయకచవితి (Vinayaka Chavithi) వస్తుండటంతో మండపాల ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి.

vinayakudu

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తొమ్మిది రోజులు పాటు జరిగే ఈ ఉత్సవాలకు నగర వ్యాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత సంవత్సరం 3 లక్షల విగ్రహాలను ప్రతింష్టించారని, ఇప్పుడు వాటి సంఖ్య 3.5 లక్షల వరకు చేరుకుంటుందని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ జనరల్ సెక్రటరీ భగవత్ రావు తెలిపారు.

ఇది ఇలా ఉండగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఏర్పాటు చేసే విగ్రహాల కోసం పోలీసులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. గత పది రోజుల నుంచి ఈ దరఖాస్తుల స్వీకరణ సాగుతుంది.

మట్టి గణనాధులనే పూజించాలంటూ ప్రచారం చేస్తూ గ్రేటర్ హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ, హెచ్ఎమ్డీఏ, టీఎస్పీసీబీ వంటి ప్రభుత్వ సంస్థలు మట్టి గణపతులను ఉచితంగా పంపిణీ చేస్తున్నాయి. పర్యావరణ పరిక్షణ కోసం ఈ మట్టి గణేష్ విగ్రహాల తయారీలో సహజ రంగులనే వినియోగించాలని, ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను ప్రతిష్టించి కాలుష్య నివారణకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.

You may also like

Leave a Comment