అసెంబ్లీ(Assembly)లో కులగణన తీర్మానంపై వాడీవేడి చర్చ సాగింది. ఈ తీర్మానానికి బీఆర్‌ఎస్ పార్టీ(BRS Party) మద్దతు తెలిపింది. ఈ తీర్మానంపై బీఆర్‌ఎస్ తరఫున మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్(Gangula Kamalakar) కీలక సూచనలు చేశారు.
కులగణన(Census) పకడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా కులగణనపై తీర్మానం మాత్రమే కాదు చట్టం చేస్తే బాగుంటుందని అన్నారు. భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు రాకుండా కులగణన చట్టం ఉండాలని, ఎలాంటి కోర్టు కేసులకు అవకాశం ఉండకూడదని గంగుల తెలిపారు.
బీహార్‌లో ఇప్పటికే కులగణన చేశారని, కానీ న్యాయపరమైన చిక్కులు వచ్చాయని ఆయన గుర్తుచేశారు. కులగణన పూర్తికాగానే వెంటనే చట్టం చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కులగణన తర్వాత చట్టం ఎలాంటి పథకాలు అమలు చేయనుందో ముందే చెప్పాలన్నారు.
బీసీ సబ్‌ప్లాన్‌ను వెంటనే అమలు చేయాలని గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు. ఎంబీసీలకు మంత్రి పదవి ఇవ్వాలని సూచించారు. ఎంబీసీలను మొదటి గుర్తించిందే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని గంగుల చెప్పుకొచ్చారు.