Telugu News » Ganja Milk Shake : ‘గంజా మిల్క్ షేక్..’ కొత్త మార్గాలు అన్వేషిస్తున్న స్మగ్లర్లు..!

Ganja Milk Shake : ‘గంజా మిల్క్ షేక్..’ కొత్త మార్గాలు అన్వేషిస్తున్న స్మగ్లర్లు..!

ఇప్పటి వరకు స్వీట్లు, చాక్లెట్లు, హాష్ ఆయిల్ రూపంలో సరఫరా చేస్తూ వచ్చిన గంజాయి స్మగ్లర్లు తాజాగా తమ దందాను మిల్క్ షేక్(Milk Shake) రూపంలోకి మార్చారు.

by Mano
Ganja Milk Shake: 'Ganja Milk Shake..' Smugglers are exploring new ways..!

మాదకద్రవ్యాల నివారణకు పోలీసు శాఖ ఎన్ని పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నా ఎక్కడో ఓ చోట మత్తు పదార్థాలు, గంజాయి నిల్వలు పట్టుబడుతూనే ఉన్నాయి. గంజాయి అక్రమ రవాణాకు స్మగ్లర్లు కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. గంజాయి(cannabis) ముడిసరుకును పౌడర్‌గా మార్చి రోజుకో కొత్త రకంగా సప్లయ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే పోలీసుల విచారణలో సంచలన విషయం బయటపడింది.

Ganja Milk Shake: 'Ganja Milk Shake..' Smugglers are exploring new ways..!

ఇప్పటి వరకు స్వీట్లు, చాక్లెట్లు, హాష్ ఆయిల్ రూపంలో సరఫరా చేస్తూ వచ్చిన గంజాయి స్మగ్లర్లు తాజాగా తమ దందాను మిల్క్ షేక్(Milk Shake) రూపంలోకి మార్చారు. పాలు, హార్లిక్స్, బూస్టులో గంజాయి పొడి కలిపి మిల్క్‌షేక్ రూపంలో తాగితే ఆరోగ్యానికి మేలు చేస్తుందంటూ గంజాయి స్మగ్లర్లు యువతకు నూరిపోసి మత్తుకు బానిసలను చేస్తున్నారు.

అంతేకాదు హైదరాబాద్ నగరంలోకి గంజాయిని పౌడర్‌గా తీసుకొచ్చి చాక్లెట్స్, సిగరెట్ ఖాళీ చేసి అందులో నింపి సరఫరా చేస్తున్నారు. ఈ మిల్క్ షేక్ తాగిన వారికి 7గంటల పాటు మత్తు దిగదు. అయితే, రెండ్రోజుల కిందట హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్ట ప్రాంతంలో సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేసి ఓ కిరాణ దుకాణం యజమాని మనోజ్‌కుమార్‌ అగర్వాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించగా అసలు విషయం బయటపడింది.

అతడి నుంచి 4 కేజీల గంజాయి పౌడర్, 160 ప్యాకెట్ల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని సప్లయ్ చేసిన మోహన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయి పొడిని కిలో రూ.2,500 చొప్పున విక్రయిస్తున్నారు. గంజాయి పొడితో చేసిన చాక్లెట్‌ ఒక్కో దానిని రూ.40కి విక్రయిస్తున్నారు. కోల్‌కతాకు చెందిన మోహన్ జయశ్రీ ట్రేడర్స్ పేరుతో ఈ దందా నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

You may also like

Leave a Comment