బంగారం(Gold)ధర మళ్లీ భగ్గుమంటోంది. నిలకడగా ఉందని బంగారు దుకాణాల దగ్గరకు వెళ్లిన గోల్డ్ లవ్వర్స్ కి షాకిచ్చింది. దేశంలో ఎక్కడికక్కడ చెట్టెక్కికూర్చుంది. అన్ని ప్రధాన నగరాల్లోనూ పెరుగుదల కనిపించింది. తులం 22 క్యారెట్స్ గోల్డ్ పై రూ. 200 పెరిగింది.
ఇక 24 క్యారెట్ల బంగారంపై రూ. 210 పెరుగుదల కనిపించింది. ఈ పెరుగుదలతో 10 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 54,950కి చేరింది. ఇక 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 60,160కి చేరింది. నగరాల వారీగా నమోదైన బంగారం,వెండి ధరలను పరిశీలించినట్టైతే…
* ముంబైలో( Mumbai) 22 క్యారెట్స్ ధర రూ. రూ. 55,400, అలాగే 24 క్యారెట్ల ధర చూసినట్టైతే రూ. 60,440గా ఉంది.
* ఢిల్లీ(Delhi)లో 22 క్యారెట్స్ ధర రూ. 55,550, అదేవిధంగా 24 క్యారెట్ల ధర విషయానికొస్తే రూ. 60,570గా ఉంది.
* చెన్నై(Chennai)లో 22 క్యారెట్స్ ధర రూ. 55,550, కాగా 24 క్యారెట్స్ రూ. 60,600గా ఉంది.
* బెంగళూరులో 22 క్యారెట్స్ ధర రూ. 55,150 గా ఉంటే 24 క్యారెట్స్ ధర రూ. 60,160గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పెరిగిన బంగార ధరలు పరిశీలిస్తే…
* హైదరాబాద్లో 22 క్యారెట్స్ ధర రూ. 55,150 అయితే 24 క్యారెట్స్ ధర రూ. 60,160గా ఉంది.
* విజయవాడలో( Vijayawada) 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 55,150 కాగా 24 క్యారెట్స్ రూ. 60,160గా ఉంది.
* విశాఖలో 22 క్యారెట్స్ ధర రూ. 55,150, వద్ద కొనసాగితే 24 క్యారెట్స్ ధర రూ. 60,160 వద్ద ఉంది.
* తెలంగాణలో మరో పెద్ద పట్టణం వరంగల్లో 22 క్యారెట్స్ ధర రూ. 55,150 కాగా, 24 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 60,160 వద్ద కొనసాగుతోంది.
* నిజామాబాద్ లో 22 క్యారెట్స్ ధర రూ. 55,150 కాగా 24 క్యారెట్స్ ధర రూ. 60,160గా వద్ద ముగిసింది.
వెండి ధరలు కూడా బంగారానికి ఏమాత్రం తీసిపోలేదు…తమ వంతు పెంకి తనాన్ని ప్రదర్శించింది.
కిలో వెండి ధర ఎంత ఉందో ఇప్పుడు చూద్దాం..
* ఢిల్లీలో రూ. 75,100
* ముంబైలో రూ. 75,100
* బెంగళూరు(Bangalore) లో రూ. 74,500గా ఉంది.
* హైదరాబాద్లో కిలో వెండి రూ. 78,500గా ఉంది.
* వరంగల్ లో కిలో వెండి ధర రూ. 78,500
* విజయవాడలో కిలో సిల్వర్ ధర రూ. 78,500వద్ద కొనసాగుతోంది.
* విశాఖలో కిలో వెండి ధర రూ. 78,500 వద్ద కొనసాగుతోంది.