Telugu News » RBI Monetary Policy: వడ్డీరేట్లు మళ్లీ యథాతథం.. ఆర్​బీఐ గవర్నర్ కీలక నిర్ణయం..!

RBI Monetary Policy: వడ్డీరేట్లు మళ్లీ యథాతథం.. ఆర్​బీఐ గవర్నర్ కీలక నిర్ణయం..!

ఆర్​బీఐ గవర్నర్‌(RBI Governor) శక్తికాంత దాస్‌(Shaktikanta Das) శుక్రవారం వివరాలు వెల్లడించారు. 5:1 ఓట్ల మెజారిటీతో ​ఈ ద్రవ్య విధాన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

by Mano
RBI Monetary Policy: Interest rates will be normal again.. RBI Governor's key decision..!

వడ్డీరేట్లపై ఆర్బీఐ(RBI) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న వడ్డీరేట్లనే యథాతథంగా కొనసాగించనున్నట్లు పేర్కొంది. ఈమేరకు ఆర్​బీఐ గవర్నర్‌(RBI Governor) శక్తికాంత దాస్‌(Shaktikanta Das) శుక్రవారం వివరాలు వెల్లడించారు. 5:1 ఓట్ల మెజారిటీతో ​ఈ ద్రవ్య విధాన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా 2023 ఏప్రిల్​ నుంచి రెపోరేటు ఉన్నట్లుగానే 6.5 శాతం కొనసాగుతుందని ప్రకటించారు.

RBI Monetary Policy: Interest rates will be normal again.. RBI Governor's key decision..!

 రెపో రేటును ఆర్​బీఐ ఎప్పటిలాగే కొనసాగించడం ఇది వరుసగా ఏడో సారి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆర్​బీఐ ప్రకటించిన తొలి ద్వైమాసిక పరపతి విధానం ఇదే కావడం గమనార్హం. ఈ సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ మాట్లాడుతూ.. భారత్‌కు ధృఢమైన వృద్ధి అవకాశాలు ఉన్నాయన్నారు. ద్రవ్యోల్బణాన్ని 4శాతానికి పరిమితి చేయాల్సిన అవసరమున్నదని అభిప్రాయపడ్డారు. ఫిబ్రవరిలో ఆహార ద్రవ్యోల్బణం ఒత్తిడి పెరిగిందని.. అందుకే ఈ ద్రవ్యోల్బణాన్ని కట్టిడి చేసేందుకు ఆర్​బీఐ కృషి చేస్తోందని పేర్కొన్నారు.

ప్రభుత్వ సెక్యూరిటీ మార్కెట్​లో రిటైల్ మదుపరుల భాగస్వామ్యాన్ని మరింత పెంచడానికి ఆర్​బీఐ ప్రత్యేకమైన మొబైల్ యాప్​ను తీసుకురానున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ ఫైనాన్షియల్ సర్వీసెస్​ సెంటర్​లో సావరిన్ గ్రీన్​ బాండ్స్​ ట్రేడింగ్ కోసం ఆర్​బీఐ త్వరలో ఓ స్కీమ్​ ప్రవేశపెట్టనుందని వెల్లడించారు. యూపీఐ ద్వారా నగదు డిపాజిట్లను అనుమతించాలని ఆర్​బీఐ ప్రతిపాదించిందని, ఆర్​బీఐ స్థాపించి 100 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో రానున్న దశాబ్దం పరివర్తన ప్రయాణం (ట్రాన్స్‌ఫర్మేషనల్​ జర్నీ) కానుందని వ్యాఖ్యానించారు.

అదేవిధంగా ప్రస్తుత 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడీపీ వృద్ధి రేటు 7 శాతం ఉండవచ్చని ఆర్​బీఐ అంచనా వేసింది. అటు 2024 మార్చి 29 నాటికి భారతదేశ ఫారెక్స్​ నిల్వలు ఆల్​-టైమ్ గరిష్ఠ స్థాయి (645.6 బిలియన్ డాలర్లకు) చేరుకున్నాయని ఆర్​బీఐ గవర్నర్ వెలలడించారు.. ఈ విదేశీ మారక ద్రవ్య నిల్వలను (బఫర్​) మరింత పెంచుకోవడంపై ఆర్​బీఐ ప్రత్యేకంగా దృష్టి సారిస్తోందని ఆయన స్పష్టం చేశారు. గ్లోబల్ డెట్​-టు-జీడీపీ నిష్పత్తి ఎక్కువగా ఉందని.. దీంతో ఆర్థిక వ్యవస్థలపై స్పిల్​-ఓవర్ ప్రభావం ఉండవచ్చని తెలిపారు.

ఈ ఆర్థిక సంవత్సరం తయారీ, సేవల రంగాల్లో స్థిరమైన వృద్ధి సాధించడానికి ప్రైవేట్ పెట్టుబడులను పెంచాల్సిన అవసరముందన్నారు. ప్రపంచ వృద్ధి ప్రస్తుతానికి స్థిరంగా ఉన్నప్పటికీ ముడిచమురు ధరల పెరుగుదలను నిశితంగా పరిశీలించాల్సి ఉంటుందన్నారు. వర్ధమాన దేశాలతో పోలిస్తే 2023లో భారత రూపాయి విలువ దాదాపు స్థిరంగా ఉందని శక్తికాంతదాస్ చెప్పుకొచ్చారు. బ్యాంకులు, ఎన్​బీఎఫ్​సీలు, ఇతర ఆర్థిక సంస్థలు తమ కార్యకలాపాలను చాలా సమర్థవంతంగా నిర్వహించాలని, అప్పుడే దేశ ఆర్థిక స్థిరత్వం పెరుగుతుందన్నారు.

You may also like

Leave a Comment